అలవైకుంఠపురంలో ఎన్టీఆర్ జలస్..!
ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హిట్ కొట్టినా తోటి హీరోలు సూపర్ హిట్ కొట్టినప్పుడు, ఆ హీరోకు మంచి పాత్ర పడ్డప్పుడు కాస్త జలస్ అనేది ఉంటుంది.
ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హిట్ కొట్టినా తోటి హీరోలు సూపర్ హిట్ కొట్టినప్పుడు, ఆ హీరోకు మంచి పాత్ర పడ్డప్పుడు కాస్త జలస్ అనేది ఉంటుంది. అలా ఉండటం మంచిదే. ఆ జలస్‌తో ఆ హీరో చేసిన దానికంటే బెస్ట్ మూవీ చేయాలని, బెస్ట్ రోల్ చేయాలనే కసి ఉంటుంది. జలస్ ఉన్నప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగే హీరోలు టాలీవుడ్‌లో చాలా మంది ఉంటారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ లు టాక్ షో లో మాట్లాడుతూ ఎన్టీఆర్‌కి ఉన్న జలస్ గురించి సరదాగా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా విషయంలో ఎన్టీఆర్‌కు జలస్ ఉన్నట్లుగా స్వయంగా వారు చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని మాటల రూపంలోనూ తమతో అన్నాడని త్రివిక్రమ్, తమన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బిట్ తెగ వైరల్ అవుతూ ఎన్టీఆర్‌ది చిన్నపిల్లాడి మనస్థత్వం అంటూ చర్చ జరుగుతోంది.
జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా' షో లో...
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ అయిన జగపతిబాబు హోస్ట్‌గా మారి 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టాక్ షో చేస్తున్న విషయం తెల్సిందే. మొదటి సీజన్‌కి మంచి స్పందన వచ్చింది. మొదటి సీజన్‌లో పెద్ద పెద్ద స్టార్స్ ను హోస్ట్ చేసి ఆ ఎపిసోడ్స్‌కి మంచి రీచ్ తీసుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 నడుస్తోంది. సీజన్ 2 లో త్రివిక్రమ్, సునీల్‌లు గెస్ట్‌లుగా హాజరు అయ్యారు. వీరితో పాటు సంగీత దర్శకుడు తమన్ సైతం ఈ ఎపిసోడ్‌లో సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కి మంచి స్పందన వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆదర్శకుటుంబం సినిమా విడుదల సమయంలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమాకు కూడా మంచి పబ్లిసిటీలా మారింది. ఈ నలుగురి మధ్య ఎన్టీఆర్ గురించిన టాపిక్ వచ్చిన సమయంలో సరదా సంఘటన ఒకటి తమన్ గుర్తు చేసుకున్నాడు.
అల వైకుంఠపురం లో సినిమా పాటలు...
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ వచ్చాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలు అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ప్రతి పాట యూట్యూబ్ లో బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే అరవింద సమేత పాటలు అంతగా ఆకట్టుకోలేదు. పైగా ఆ పాటలు ఏడుపుగొట్టు పాటలుగా ఉంటాయి. అదే విషయాన్ని తమన్‌తో ఎన్టీఆర్... నాకేమో ఏడ పోయినాడో, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్లి పోతాడు అని పాటలు ఇచ్చి, వెంటనే బన్నీకి మాత్రం సామజవరగమనా, బుట్టబొమ్మ, రాములో రాముల వంటి పాటలు ఇచ్చావంటూ ఫోన్‌లో కాస్త గట్టిగానే అన్నాడట. బూతులతో తారక్ సరదాగా తిట్టాడు అంటూ తమన్ చెప్పాడు.
అరవింద సమేత ఎన్టీఆర్...
అదే సమయంలో త్రివిక్రమ్ సైతం ఎన్టీఆర్ తనతో.. ఏడ సచ్చిపోయాడు, ఏ మట్టిలో కొట్టుకు పోయాడు, నా మీద దుమ్మేసి చొక్కా విప్పించేసి చూపించావు, కానీ బన్నీని మాత్రం చాలా నీట్‌గా చూపించావు అన్నాడట. తమన్, త్రివిక్రమ్‌తో ఉన్న సన్నిహిత్యంతో, అనుబంధంతో తారక్ అలా వారితో అలవైకుంఠపురంలో సినిమా గురించి స్పందించాడు. అరవింద సమేత తర్వాత వెంటనే వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో హీరో పాత్ర, పాటలు పూర్తిగా వేరు ఉండటంతో కచ్చితంగా ఏ హీరోకు అయినా జలస్ ఉంటుంది.
ఎన్టీఆర్ సైతం నాతో ఎందుకు ఇలాంటి సినిమాను త్రివిక్రమ్ తీయలేదు అనే జలస్ ఎన్టీఆర్‌కి వచ్చి ఉంటుంది. దాన్ని మనసులో ఉంచుకోకుండా బయటకు అనేడయం ఆయన మంచితనం, ఆయన తత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి వారి ఆల్‌టైమ్ ఫేవరెట్ సినిమాల్లో అరవింద సమేత ముందు ఉంటుంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. అరవింద సమేత తర్వాత బన్నీ కూడా ఇలాంటి పాత్ర నాకు దక్కలేదే అని జలస్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆ కసితోనే మరిన్ని మంచి సినిమాలు చేశాడు. మొత్తానికి జగపతి బాబు టాక్ షో లో ఎన్టీఆర్ కి అప్పుడు అరవింద సమేత సినిమాపై ఉన్న జలస్‌ను త్రివిక్రమ్, తమన్ చెప్పారు.