కాల్పుల ఘటనపై నోరు విప్పిన టైగర్ ష్రాఫ్

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాప్ పై దుండ‌గులు జ‌రిపిన దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-10-25 07:11 GMT

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాప్ పై దుండ‌గులు జ‌రిపిన దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టైగ‌ర్ ష్రాప్ ను ప‌ల‌వువురు బాలీవుడ్ స్టార్లు ప‌రామ‌ర్శించారు. ఇలాంటి దాడులు మ‌ళ్లీ పున‌రా వృతం కాకూడ‌ద‌ని ప్ర‌భుత్వానికి నివేదించారు. తాజాగా ఈ ఘటనపై టైగ‌ర్ ష్రాప్ తీవ్ర ఆందోళనవ్యక్తం చేశారు. తనకు ఇండస్ట్రీలో గానీ.. వెలుపల గానీ ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని అసలు తనను లక్ష్యంగా చేసుకుని ఎందుకు కాల్పులకు తెగబడ్డారో అర్థం కావడం లేదని విచారణ అధికారుల వద్ద వాపోయారు.

ఈ ఘోర ప్రమాదం తాలుకా? మానసిక ఒత్తిడి నుంచి టైగర్ ష్రాఫ్ ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతున్నారు. `నేను తీవ్రమైన షాక్‌లో ఉన్నాను. ప్రస్తుతం ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిం చారు? నాకెవరితోనూ శత్రుత్వం లేదు. మరి నాపైనే ఎందుకు దాడి జరిగింది?` అంటూ తీవ్రంగా కలత చెందినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా దాడి జరగడం టైగ‌ర్ ను తీవ్రంగా భయాందోళనకు గురిచేసింది.

దాడి సమాచారం అందుకున్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తును వేగవంతం చేసి 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ జరిపి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాయుధ దాడులు నిర్వహించి దాడికి పాల్పడిన ప్రధాన నిందితులతో పాటు 11 మందిని అదుపులోకి తీసుకుంది. దుండగులు వాడిన ఆయుధాలను సూరత్‌లో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో తీవ్ర అలజడి రేపుతోంది. బాలీవుడ్‌లో గతంలో సల్మాన్ ఖాన్ నివాసం బయట జరిగిన కాల్పుల ఘటనల తరహాలోనే ఈ దాడి కూడా జరిగిందని.. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను భయాందోళనకు గురిచేయడానికే దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం .. పోలీసు యంత్రాంగం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వివాదాలకు దూరంగా ఉండి తన పని తాను చేసుకుపోయే టైగర్ ష్రాఫ్ పై ఈ తరహా దాడి జరగడం బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. సెలబ్రిటీల రక్షణ, ముంబైలో పెరుగుతున్న గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల సంస్కృతిపై ఈ ఘటన మ‌రుఓసారి తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తుంది.

Tags:    

Similar News