థ్రెట్స్ మధ్య స్టార్ హీరో బిజినెస్ ధమాకా!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్‌లో సల్మాన్ పేరిట నిర్మాణహైన అత్యంత విలాసవంతమైన హై-రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఆయన శనివారం రాత్రి అధికారికంగా ప్రారంభించారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్‌లో సల్మాన్ పేరిట నిర్మాణహైన అత్యంత విలాసవంతమైన హై-రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ఆయన శనివారం రాత్రి అధికారికంగా ప్రారంభించారు. జేకాబ్ అండ్ కో - జిబి రియల్టీ సంస్థల భాగస్వామ్యంతో రూపొందిన ప్రాజెక్ట్ యాడ్ ప్రోమోలో సల్మాన్ ఖాన్ క్లాసీ లుక్‌తో కనిపించారు. అయితే పంజాబ్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరుకాకపోవడం గమనార్హం.
ఈ లాంచ్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోవడానికి అనివార్య కారణాలు అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నా? దీని వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు .. భద్రతా ముప్పు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఈవెంట్ కోసం సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. `అనివార్య కారణాల వల్ల నేను ఈ రాత్రి కార్యక్రమానికి రాలేకపోయాను. కానీ భౌతికంగా అక్కడ లేకపోయినా నా హృదయం, శుభాకాంక్షలు మీతోనే ఉన్నాయి` పేర్కొన్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణ బెదిరింపులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత బాలీవుడ్లో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. సల్మాన్ ఖాన్‌కు చుట్టూ అత్యంత కఠినమైన వై-ప్లస్ కేటగిరీ భద్రత ఉండటంతో సల్మాన్ నేరుగా లక్ష్యంగా చేసుకోవడం సాధ్యం కాకనే దుండగులు ఇతర నటులను .. పరిసరాలను భయాందోళనకు గురి చేస్తున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ వంటి సున్నితమైన ప్రాంతంలో ప్రత్యక్షంగా పర్యటించడం భద్రత దృష్ట్యా శ్రేయస్కరం కాదని భావించే సల్మాన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళితే పంజాబ్‌లోని చండీగఢ్ ప్రాంతంలో 2,500 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మి స్తున్నారు. `సల్మాన్ ఖాన్ టవర్స్` పేరుతో ప్రసిద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో 6 బహుళ అంతస్తుల టవర్లు ఉండనున్నాయి. ఇందులో 3 .. 4 బిహెచ్కే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, అత్యాధునిక టౌన్షిప్ తరహా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. లాంచ్ యాడ్‌లో సల్మాన్ ఖాన్ సూట్ ధరించి 41 లక్షల విలువైన లగ్జరీ వాచ్‌తో మెరుస్తూ కనిపించారు.
మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నడుమ సల్మాన్ ఖాన్ పర్సనల్ లైఫ్ - ప్రొఫెషనల్ ప్రాజెక్ట్‌లలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముంబైలోని బాంద్రా చింబాయ్ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఆరు అంతస్తుల భవన నిర్మాణానికి ఆయనకు ఇటీవల అనుమతులు లభించాయి. దశాబ్దాలుగా బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోనే నివాసముంటున్న సల్మాన్ భద్రతా కారణాలు .. కుటుంబ అవసరాల రీత్యా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇలా ఒకవైపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల నీడ.. మరోవైపు కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం `మాన్స్టర్` షూటింగ్‌తో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా? బిష్ణోయ్ గ్యాంగ్ ప్రభావం ఎక్కువగా ఉండే పంజాబ్ రీజియన్‌లో ప్రాజెక్ట్ లాంచ్‌కు సల్మాన్ భౌతికంగా దూరంగా ఉండటం బాలీవుడ్‌తో పాటు వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.