ముంబై వీధుల్లో అందాల పరిణీతం
పరిణీతి చోప్రా అలియాస్ పారీ పరిచయం అవసరం లేదు. ఈ భామ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. పనిలో పనిగా మరో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. యంగ్ ట్యాలెంటెడ్ ఆయుష్మాన్ ఖురానా సరసన ఓ చిత్రంలో నటిస్తూనే.. ది గర్ల్ ఆన్ ట్రైన్ అనే హాలీవుడ్ రీమేక్ లోనూ నటిస్తోంది. ఈ మూవీ టీజర్ ఇటీవలే రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ప్రశంసలు కురిసాయి.
మరోవైపు సోషల్ మీడియాల్లోనూ పారి చాలా స్పీడ్ గా ఉంది. తాజాగా పరిణీతి జిమ్ కి వెళుతూ ముంబైలో కెమెరా కంటికి చిక్కిన ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. టైట్ స్పోర్ట్ దుస్తుల్లో పారి అలా జిమ్ వెలుపల నడిచి వెళుతుంటే యూత్ అదే పనిగా తననే ఫాలో అయ్యారు. మరోవైపు పారి కోస్టార్ ఆయుష్మాన్ ఖుర్రానాను ముంబై శివారులోని ఒక క్లినిక్ వెలుపల కనిపించారు. పరిణీతి తన కారు నుండి ముంబై శివారు అంధేరిలో కనిపించింది.
ఆయుష్మాన్ గత కొన్ని నెలలుగా చండీఘర్ లో ఉన్నాడు. అక్కడ అభిషేక్ కపూర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో వాణీకపూర్ కథానాయిక. అతడు ఇటీవల తన కుటుంబంతో ముంబైకి తిరిగి వచ్చాడు. పరిణీతి తదుపరి చిత్రం ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఫిబ్రవరి 26 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంది. ప్రస్తుతం ఆ ఇద్దరూ జంటగా నటిస్తుండడంతో రకరకాల గాసిప్పులు కూడా షికార్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.