తెలుగు, తమిళ హీరోతో కలిసి రాబోతున్న అట్లీ..!
రాజా రాణి సినిమాతో మంచి టాలెంటెడ్ దర్శకుడిగా పేరు సంపాదించి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆ పేరు కాపాడుకున్న తమిళ దర్శకుడు అట్లీ. సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ డైరెక్షన్ వహించిన అట్లీ ఆ తర్వాత హ్యూజ్ ఆఫర్ అందుకున్నాడు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ కింగ్ ఖాను షారూక్ ఖాన్ తో జవాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ సినిమా. అయితే ఇంతకు మించి బిగ్గెస్ట్ ఆఫర్ అందుకున్నాడట అట్లీ.
జవాన్ సినిమా తర్వాత అట్లీ దళపతి విజయ్ తో దళపతి 68 మూవీ చేయనున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టు తర్వాత చేయబోయే ప్రాజెక్టు మరో రేంజ్ లో ఉండనుందని టాక్. ఓ తెలుగు ప్రొడక్షన్ నుండి అట్లీకి ఈ ఆఫర్ వచ్చిందట. మల్టీ స్టారర్ గా రానున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో భారీగా నిర్మించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అట్లీ దర్శకత్వంలో ఓ బిగ్ తెలుగు ప్రొడక్షన్ నుండి రాబోతున్న మల్టీ స్టారర్ మూవీలో ఓ తెలుగు హీరో, ఓ తమిళ హీరో లీడ్ రోల్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అట్లీ విజయ్ కాంబోలో మూడు సినిమాలు రావడంతో అంతా ఈ సినిమాలో కూడా విజయ్ ఉంటాడని అనుకుంటున్నారు. అయితే దళపతి మాత్రం ఈ ప్రాజెక్టులో ఉండబోవడం లేదని తెలుస్తోంది. గతంలో తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలు వచ్చాయి. తాజాగా దళపతి 68 తో వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం రాబోతుంది.
అయితే ఆ తర్వాత వచ్చి మల్టీస్టారర్ చిత్రంలో మాత్రం విజయ్ అస్సలే ఉండడని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మూవీ టీం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అట్లీతో సినిమా అంటేనే ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతుంటారు.. అందులోనూ మల్టీ స్టారర్ చిత్రం అంటే క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది, ఎవరెవరు నటులు అనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.