మహేష్ తో మొదలెట్టి ఆర్యతో ఆగాడు

Update: 2016-09-28 03:30 GMT
'సంఘమిత్ర' అంటూ ఒక 100 కోట్ల రూపాయల సినిమాను తీయాలని ప్లాన్ చేశాడు హీరోయిన్ ఖుష్బూ మొగుడు సి.సుందర్. ఇదొక హిస్టారికల్ ఫ్యాంటసీ చిత్రం. ఈ సినిమాలో కాస్టింగ్ చాలా భారీగానే చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడీ దర్శకుడు. అయితే ఇతగాడు అనుకున్న క్యాస్టింగ్ మాత్రం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోలకు ఎట్టకేలకు పెట్టేసుకున్నాడు.

100 కోట్ల బడ్జెట్.. హిస్టారికల్ ఫ్యాంటసీ సినిమా.. బాహుబలిని బీట్ చేసే రేంజులో వర్కవుట్ చేయాలనేది ప్లాన్. అయితే ఈ సినిమాను చేయడానికి మహేష్‌ బాబు అంతగా సుముఖత చూపించలేదు. మహేష్‌ తో పాటు సినిమాలో మరో హీరో కూడా చేయాలి. ఆ హీరో కోసం కూడా చాలామందినే ప్రయత్నించాడు సుందర్ కాని వర్కవుట్ కాలేదు. ఇకపోతే చివరకు జయం రవి అండ్ ఆర్యను ఈ సినిమాలో హీరోలుగా తీసుకున్నాడు సుందర్. ముఖ్యంగా మహేష్‌ చేయాల్సిన రోల్ ను ఆర్య చేస్తున్నాడట. హీరోలిద్దరికీ ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లను దింపాలని చూస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ఇప్పటివరకు మగధీర, బాహుబలి వంటి సినిమాలను బీట్ చేయడానికి తమిళంలో చాలా సినిమాలే వచ్చాయి. మొన్నామధ్యన విజయ్ పులి కూడా అదే బాపత్తులో దిగింది. కాని బీట్ చేయడం కుదర్లేదు. చూద్దాం ఇప్పుడు సంఘమిత్ర ఏం చేస్తాడో!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News