క్రిస్మ‌స్ సంబ‌రాల్లో అరోరా సిస్ట‌ర్స్ హంగామా

Update: 2020-12-26 06:30 GMT
ఓవైపు ప్ర‌పంచ‌మంతా క్రిస్మ‌స్ సంబ‌రాల్లో మునిగి తేలుతోంది. ఫేజ్ 3 ప్ర‌పంచం ఇందుకు ఎంత‌మాత్రం మిన‌హాయింపేమీ కాదు. ఇక బాలీవుడ్ లో క్రిస్మ‌స్ వేడుక‌ల్ని ఆల్మోస్ట్ ప్ర‌తి స్టార్ ఎంజాయ్ చేస్తుంటారు. అందాల న‌టి మ‌లైకా అరోరా ఖాన్ ఇంట కూడా బోలెడంత సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. కాబోయే హీరో కం న‌ట‌వార‌సుడు అర్హాన్ ఖాన్ తో క‌లిసి మ‌లైకా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్ జ‌రుపుకున్నారు.

మ‌లైకా అరోరా- అమృత అరోరా సిస్ట‌ర్స్ కుటుంబ స‌మేతంగా క్రిస్మ‌స్ వేడుక‌ల్ని సంబ‌రంగా జ‌రుపుకున్నార‌ని తాజాగా రివీలైన గ్రూప్ ఫోటో చెబుతోంది. ఈ ఫోటోలో అర్హ‌న్ ఖాన్ ఉన్నాడు. ఇక ఇదే స‌మ‌యంలో అరోరా సిస్ట‌ర్స్ హీటెక్కించే రెడ్ కార్పెట్ (త్రోబ్యాక్) వీడియోని వైర‌ల్ చేస్తూ ప్ర‌ముఖ మీడియా హంగామా చేయ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

త్రోబాక్ వీడియోలో సోదరీమణుల వేడెక్కించే స్టింట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అరోరా సోదరీమణులు వారి రెడ్ కార్పెట్ లుక్ లో అగ్గి రాజేసార‌నే చెప్పాలి. ముఖ్యంగా 47ఏళ్ల మ‌లైకా అందం అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేద‌న్న‌ది అభిమానుల కామెంట్.
Tags:    

Similar News