వెయిట్ తగ్గాకే ఏదైనా చేసేది

Update: 2018-02-07 17:30 GMT
భాగ‌మ‌తి సినిమాలో అనుష్క న‌టన‌కు టాలీవుడ్ మాత్ర‌మే కాదు కోలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. అబ్బా ఏం చేసింది అని మెచ్చుకునేలా చేసింది. అయినా పెద్ద హ్యాపీగా లేదు అనుష్క‌. కార‌ణం బ‌రువు. పెరిగిన బ‌రువు త‌ర‌గ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. అందుకే బ‌రువు త‌గ్గాకే సినిమాలు చేస్తానంటూ శ‌ప‌థం చేసింద‌ట జేజ‌మ్మ‌.

జీరో సైజ్ సినిమాలో న‌టించ‌డం కోసం అడ్డ‌మైన‌వ‌న్నీ తినీ బాగా లావెక్కింది అనుష్క‌. పోనీ ఆ సినిమా ఏమైనా కాస్త ఆడిందా అంటే అదీ లేదు. బ‌రువు మాత్ర‌మే మిగిలింది. యోగా చేసినా - ఎక్స‌ర్‌ సైజులు చేసినా కేల‌రీలు మాత్రం క‌ర‌గ‌డం లేదు. చివ‌రికి మూడు నెల‌లు సినిమాల‌కు సెల‌వు చెప్పి కేర‌ళ వెళ్లి బ‌రువు త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. అయినా పెద్ద‌గా ఫలితం లేదు. భాగ‌మ‌తి ప్ర‌మోష‌న్ల‌లో భారీగానే కనిపించింది స్వీటీ. ఆమె లావును చూసి కొన్ని సినిమాలు యూ ట‌ర్న్ తీసుకుని వెళ్లిపోయాయ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఇవి ఆమె చెవిన కూడా ప‌డ్డాయ‌ని స‌మాచారం. ఇక టాలీవుడ్‌లో ఆమె శ్రేయోభిలాషులు బ‌రువు త‌గ్గ‌మ‌ని, లేకుంటే సినిమా ఛాన్సులు రావ‌ని హెచ్చ‌రించార‌ట‌. దీంతో విష‌యాన్ని సీరియ‌స్‌ గా తీసుకుంది అనుష్క‌.

ఇప్ప‌టికే కొన్ని సినిమాల‌ను ఓకే చేసింది అనుష్క‌. ఇప్పుడు వాటిని కూడా పెండింగ్‌ లో పెట్టింద‌ట‌. తాను బ‌రువు త‌గ్గి వ‌చ్చాకే సినిమాలు చేస్తాన‌ని చెప్పింద‌ట‌. అందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఒప్పుకున్న‌ట్టే టాక్. ఎందుకంటే అనుష్క స‌న్న‌గా అయితే వారికే మంచిది క‌దా. లేకుంటే బాహుబ‌లిలో జ‌క్క‌న్న చేసిన‌ట్టు అదేదో సాఫ్ట్‌వేర్‌తో ఆమెను స‌న్న‌గా చెక్కుకోవాలి.
Tags:    

Similar News