లుక్ లోనూ ప్ర‌యోగాల‌కు వెర‌వ‌ని పాల్

Update: 2021-08-12 16:30 GMT
ట్యాలెంటెడ్ బ్యూటీ అమ‌లాపాల్ కెరీర్ ప‌రంగానే కాదు.. స్టైలింగ్ ఫ్యాష‌న్స్ ప‌రంగానూ ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకుంటుంద‌న్న సంగ‌తి తెలిసిన‌దే. పాల్ స్టైలిష్ ఎలివేష‌న్స్ లో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. హాటెస్ట్ కంటెంట్ తో అల్ట్రా మోడ‌ల్ లుక్ లో క‌నిపించ‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంది. డిజైన్ కాస్ట్యూమ్స్ ని  హైలైట్ చేస్తూనే కిల్ల‌ర్ లుక్స్ తో క‌ట్టిప‌డేస్తుంది.

తాజాగా ఈ కేర‌ళ కుట్టి మ‌రోసారి త‌న‌దైన మార్క్ లుక్ లో ఆక‌ర్షణీయంగా కనిపించింది. వైట్ హాల్టర్ క్రాప్ టాప్ హాఫ్ షోల్డ‌ర్ డ్రెస్ లో ఎంతో అందంగా క‌నిపిస్తున్న ఫోటోని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. బాట‌మ్ లో  న‌లుపు..తెలుపు..లైట్ ఆరెంజ్ క‌ల‌ర్ ప్యాంటును ధ‌రించింది. ట్రైక‌ల‌ర్ ప్యాంట్ లుక్ ప‌రంగా హైలైట్ గా నిలిచింది.

పోనీ టెయిల్ హెయిర్ తో .. క‌ళ్లు పెద్ద‌వి చేసి.. ఓర చూపుల వ‌ల‌లు విసిరి కిల్లింగ్ లుక్స్ తో ఆక‌ట్టుకుంది. డిజైనర్ లుక్ ర్ కి త‌గ్గ మేక‌ప్ తో ప్ర‌కాశంతంగా మెరుస్తోంది.  ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి అభిమానుల‌ను ఖుషీ చేసింది. ఫ్యాన్స్ ఆస‌క్తిక‌ర  కామెంట్ల‌తో  హీటెక్కిస్తున్నారు. ఇక కెరీర్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లే  తెలుగులో పిట్ట క‌థ‌లు సిరీస్ లో క‌నిపించింది. అలాగే త‌మిళ్..మ‌లయాళ భాష‌ల్లోనూ ఒక‌టి రెండు సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు డిజిట‌ల్ మీడియా లోనూ అమ్మ‌డు దూసుకుపోతుంది. వెబ్ సిరీస్ ల‌పైనా దృష్టి పెట్టి ఆ రంగంలోనూ రాణించాల‌ని క‌మిట్ మెంట్ తో ముందుకెళుతోంది .

వ్య‌క్తిగ‌త  జీవితంలో త‌గిలిన ఎదురుదెబ్బ‌ల‌ను సైతం  ఎంత మాత్రం  లెక్క‌చేయ‌కుండా కెరీర్ ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగిపోతుంది. అమ‌లాపాల్ ని కెరీర్ ప‌రంగా దెబ్బ తీయాల‌ని కోలీవుడ్ ఇండ్ట్రీలో ఆమెపై నెగివిటీని తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసారు. కానీ వాటికి త‌న‌దైన ప్ర‌తిభ‌తో స‌మాధాన‌మిస్తూ తెలివిగా ముందుకు వెళుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అధో ఇదో ప‌ర‌వై పోలా...ఆడుజీవితం చిత్రాల్లో అమ‌లాపాల్ న‌టిస్తోంది.
Tags:    

Similar News