ఫోటో స్టోరి: ఢిల్లీలో అలా.. అమలలా..

Update: 2017-02-17 04:28 GMT
ఫోటో స్టోరి: ఢిల్లీలో అలా.. అమలలా..
మన దేశ రాజధాని న్యూఢిల్లీలో వాతావరణం చాలా డిఫరెంట్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. వింటర్ లో విపరీతమైన చలి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్యాషన్ కేరాఫ్ ముంబై అయినా.. ఈ విషయంలో ఢిల్లీ ఏం తక్కువ తినలేదు.

ఇప్పుడు ఢిల్లీలో ఎలా ఉండాలో చూపిస్తోంది సౌత్ బ్యూటీ అమలాపాల్. మలయాళీ కుట్టి అయిన అమల.. షార్ట్ బ్రేక్ తీసుకున్నా మళ్లీ సినిమాల్లో స్పీడ్ పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఉన్న ఈమె.. అక్కడి ఫ్యాషన్ ఎలా ఉండాలో తన స్టైల్ లో చూపించేసింది. పొట్టి బట్టలు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. కళ్లజోడు.. చలి తట్టుకోవడానికి జాకెట్.. అమలా పాల్ స్టైలింగ్ అదిరిపోయిందంతే. ఈ ఫోటోను స్వయంగా ట్వీట్ చేసిన అమల.. 'ఏమీ ఆశించకపోతే జీవితంలో బోలెడన్ని వెలుగు జిలుగులు ఉంటాయ్' అనే అర్ధం వచ్చేలా ట్వీట్ పెట్టింది.

న్యూఢిల్లీలో ఉన్నానని.. వింటర్ ఫ్యాషన్ అని చెప్పిన అమ్మడు.. ఈ స్టైలింగ్ విపరీతంగా నచ్చిందని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ భామ కన్నడ.. మలయాళ.. తమిళ భాషల్లో కలిపి మూడు భాషల్లో నటించేస్తోంది. ఇవన్నీ స్టార్ హీరోలు నటించేవో.. లేకపోతే క్రేజీ ప్రాజెక్టులో కావడం విశేషం. అమల రీఎంట్రీనే కాదు.. ఈ స్టైలింగ్ కూడా అదిరిపోలా.. ఆ పోలా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News