తేజూ జోక్ చేశాడు.. నా పెళ్లి ఇప్పుడు కాదు
నిహారిక పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీలో జరుగబోతున్న పెళ్లి ఎవరిది అయ్యి ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిహారిక పెళ్లకి ముందు నుండే మెగా బ్రదర్స్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీఠలు ఎక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆయన తల్లి పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఒకానొక సమయంలో ఈ ఏడాది పెళ్లి ఫిక్స్ చేసుకుని తేజ్ వచ్చే ఏడాది పెళ్లి పీఠలు ఎక్కుతాడన్నారు. ఇటీవల తన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రచారం సమయంలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే అయిదు సంవత్సరాల వరకు పెళ్లిపై తనకు దృష్టి లేదు అన్నాడు. తనకంటే ముందు అల్లు శిరీష్ పెళ్లి చేసుకుంటాడని.. అతడి తర్వాత నా పెళ్లి ఉంటుందని సరదాగా వ్యాఖ్యలు చేశాడు.
తేజూ చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఏడాది అల్లు శిరీష్ పెళ్లి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అమ్మాయిని చూశారా.. చూస్తున్నారా లేదా ప్రేమ వివాహం చేసుకుంటున్నారా అంటూ శిరీష్ కు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. తేజూ సరదగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు. నా పెళ్లి విషయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి ఏమీ లేదు. మరి కొంత కాలం నేను బ్యాచిలర్ గానే లైఫ్ ను గడుపుతాను అన్నాడు. పెళ్లి చేసుకునే సమయంలో నేనే స్వయంగా ప్రకటిస్తాను అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టారు. వీరిద్దరిలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటారో కాని వీరిద్దరు కూడా ఈమద్య కాలంలో పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా లేరు అని తేలిపోయింది. మరి వరుణ్ తేజ్ అయినా పెళ్లికి సిద్దం అవుతాడా అనేది చూడాలి.