32 లక్షల వ్యూయర్ల లెక్క తేల్చిన శిరీష్‌

Update: 2016-08-29 11:30 GMT
ఈ మధ్యన తన కొత్త సినిమాను 32 లక్షల మంది చూసినందుకు థ్యాంక్స్ అంటూ అల్లు శిరీష్‌ ఒక యాడ్ ఇచ్చాడు. అంటే 32 లక్షల మంది సగటున 70 రూపాయలు చెల్లించేసుకుంటే.. దాదాపు 23 కోట్లు గ్రాస్ లెక్క తేలుతుంది. ఆ లెక్కన ''శ్రీరస్తు శుభమస్తు'' కలక్షన్ల గురించి ఒక సందేహం వచ్చేసింది. అందుకే ఒకవేళ శిరీష్‌ ఏమైనా ఫేక్ కలక్షన్లను ప్రచారం చేస్తున్నాడా అనే సందేహం కూడా చాలా వెల్లిబూర్చారు. కాకపోతే శిరీష్‌ లెక్క శిరీష్‌ కు ఉంది.

''32 లక్షల మంది చూశారంటే.. 13 కోట్ల గ్రాస్‌.. 8.5 కోట్ల షేర్ వసూలు చేసింది అని అర్దం. ఎందుకంటే జంగారెడ్డిగూడెంలో టిక్కెట్ ధర 25 రూపాయలు ఉంటే.. హైదరాబాద్ లో 150 ఉంది. అంటే 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి.. హైదరాబాద్ లో సినిమాను చూసిన వారి సంఖ్య తక్కువే కాని.. గుంటూరులో వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. అది లెక్క'' అంటూ క్లారిటీ ఇచ్చాడు శిరీష్‌. మొత్తానికి ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తు నిజమైన ఆదాయం ఎంతో తెలిసిపోయింది కాబట్టి.. క్రిటిక్స్ కు కూడా ఒక క్లారిటీ వచ్చేసే ఉంటుంది.

ఇకపోతే అసలు ఈ సినిమా చేయడానికి డీలే ఎందుకయ్యిందో వివరిస్తూ.. ''ఈ సినిమాకంటే ముందు 25 స్ర్కిప్టులు వినుంటాను. అయితే హీరోయిన్ ఇంటికెళ్ళి చేసే కన్ఫ్యూజన్ కామెడీ.. లేదంటే ఎప్పుడో విడిపోయిన కుటుంబాన్ని ఇప్పుడు కలపడం.. ఇవే కథలు వచ్చాయి. చివరకు పరశురామ్ ఈ లైన్ చెప్పాక కాని నేను తేరుకోలేదు'' అంటూ చెప్పాడు శిరీష్‌. అది సంగతి.
Tags:    

Similar News