నిర్మాతగా అల్లు అర్జున్ మామ.. ప్రథమ భూదాతపై బయోపిక్

Update: 2021-07-31 05:03 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా మారాడు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో 1951వ సంత్సరంలో గాంధీజీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోభాభావే అడగగానే ప్రథమ భూదాతగా 100 ఎకరాల భూమిని దానం చేసిన తెలుగు వ్యక్తి, పోచంపల్లికి చెందిన వెదిరె రాంచంద్రారెడ్డి. ఈయన ప్రథమ భూదాతగా పేరుపొందాడు.

ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూపోరాటాలు సాగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేదలకు అందజేయడం ఒక మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఇదో మహాయజ్ఞంగా సాగింది.  ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక సినిమా రూపకల్పనకు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పూనుకున్నారు.

భూపంపిణీకి స్ఫూర్తినిచ్చిన రాంచంద్రారెడ్డి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రాంచంద్రారెడ్డి మనవడు అవరింద్ రెడ్డి సమర్పణలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే నటీనటులను ఎంపిక చేసి చిత్రాన్ని ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
Tags:    

Similar News