దువ్వడానికి 'దువ్వాడ' రెడీ అయ్యాడా

Update: 2017-03-24 04:34 GMT
వరుస హిట్స్ తో టాలీవుడ్ మొత్తం మీద సూపర్ ట్రాక్ లో ఉన్న అల్లు అర్జున్.. ఒక్క మాటతో వివాదంలో ఇరుక్కుపోయాడు. చెప్పను బ్రదర్ అంట సరైనోడు సక్సెస్ మీట్ లో చేసిన కామెంట్.. ఆ సినిమాపై అంతగా ఎఫెక్ట్ చూపలేదేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. డీజే-దువ్వాడ జగన్నాధం కి డిజ్ లైక్స్ ఆ స్థాయిలో ఉండడం.. పవన్ ఫ్యాన్స్ మహిమే అన్నది ప్రధానమైన ఆరోపణ.

డీజే వసూళ్లను ఇది ఎఫెక్ట్ చూపనుందనే అంచనాలున్నాయి. అందుకే పవన్ ఫ్యాన్స్ ను చల్లబరిచే కార్యక్రమం ప్రారంభించనున్నాడట బన్నీ. ఇందుకు దువ్వాడ జగన్నాధం మూవీనే ఆయుధంగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మొదలైందని టాక్ వినిపిస్తోంది. పవన్ రిఫరెన్స్ ఉండేలా.. కొన్ని సీన్స్ తో కూడిన ఓ ఎపిసోడ్ ఉండేలా చూడమని దర్శకుడు హరీష్ శంకర్ కి చెప్పాడట బన్నీ. పవర్ స్టార్ కి వీరాభిమాని అయిన హరీష్ శంకర్ కి.. ఈ ఒక్క క్లియరెన్స్ చాలు కదా రెచ్చిపోవడానికి. ఇప్పటికే సీన్స్ రాసేయడమే కాదు.. షూటింగ్ కూడా చేసేస్తున్నారని వినికిడి.

పవన్ కళ్యాణ్ ని గుర్తు తెచ్చే సీన్స్.. డీజేలో హైలైట్ అవుతాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ బిట్ ను.. ట్రైలర్ లోనే పెట్టాలని కూడా భావిస్తున్నారట. మొత్తానికి దువ్వాడ జగన్నాధంతో పవన్ ఫ్యాన్స్ ను బన్నీ కూల్ చేసేయడం అయితే ఖాయంగానే కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News