‘సరైనోడు’ను ఆ ఇద్దరూ వద్దన్నారా?

గత నెల రిలీజై డిజాస్టర్ గా మిగిలిన ‘కృష్ణాష్టమి’ సినిమాను వాస్తవానికి అల్లు అర్జున్ చేయాల్సింది. కానీ అతనొద్దన్నాడు. సునీల్ లైన్లోకి వచ్చాడు. ఇలా ఎవరి కోసమో అనుకుని.. ఇంకెవరితోనో సెట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి టాలీవుడ్లో. బన్నీ సంగతే చూస్తే.. ‘కృష్ణాష్టమి’ కథను అతను రిజెక్ట్ చేయడంతో సునీల్ కు వెళ్లినట్లే.. ఇంకొకరు రిజెక్ట్ చేసిన కథను బన్నీ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.. సరైనోడు.
ఈ కథను మూడేళ్ల కిందట ‘లెజెండ్’ సినిమా చేసేటపుడు బోయపాటి శ్రీను.. గోపీచంద్ కు చెప్పాడట. కానీ అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆ తర్వాత రామ్ చరణ్ కు సైతం ఈ కథ చెప్పాడట బోయపాటి. కానీ అతనూ ఒప్పుకోలేదట. అయినప్పటికీ మెగా ఫ్యామిలీకే చెందిన అల్లు అర్జున్ కు కథ చెప్పి ఒప్పించడం విశేషమే. ఐతే ఇద్దరు రిజెక్ట్ చేసిన కథను అల్లు అరవింద్ లాంటి వాడు ఓకే చేయడం మామూలు విషయం కాదు.
ఇక్కడే ట్విస్టు ఉంది. బోయపాటి చెప్పిన కథను యథాతథంగా అంగీకరించలేదు అరవింద్. తన టేస్టుకు తగ్గట్లు, బన్నీ ఆలోచనలకు తగ్గట్లు కథలో మార్పులు చేయించి.. దాదాపు ఆర్నెల్ల పాటు తన రచయితల సహకారం కూడా అందించి.. స్క్రిప్టు అనుకున్న ప్రకారం వచ్చాకే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాడట అరవింద్. మరి ఫైనల్ గా ‘సరైనోడు’ ఔట్ పుట్ ఎలా వచ్చిందో.. సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో.. ఈ కథను రిజెక్ట్ చేసిన హీరోలిద్దరూ ఎలా ఫీలవుతారో చూడాలి.