ఈ 'గోల్డ్' అదిరిపోయిందిగా!!

Update: 2016-10-22 04:28 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి బాగా స్పీడ్ ఎక్కువ. వేరే విషయాల్లో సంగతేమో కానీ.. సినిమాలు ఫినిష్ చేసేసి రిలీజ్ చేయడంలో.. కుర్రాళ్లకు కూడా అందనంత స్పీడ్ తో దూసుకెళ్లిపోతున్నాడు. ఎప్పటి సీజన్ కు తగ్గట్లుగా అప్పుడు కథలు ఎంచుకుంటూ.. ట్రెండ్ మార్చేయాలనే ప్రయత్నాలు కాకుండా.. ఉన్న ట్రెండ్ లోనే ప్రామిసింగ్ హిట్స్ ఇచ్చేయడం ఈ ఖిలాడీ స్టైల్.

ప్రస్తుతం దేశంలో బయోపిక్ లు.. రియల్ లైఫ్ స్టోరీల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసింది. వీటికి దేశభక్తి టచ్ కూడా ఉందంటే.. ఇక వాటి జోరు ఆపడం కష్టం. ఎవరో కాదు.. స్వయంగా అక్షయ్ కుమార్ ఇప్పటికే బేబీ-రుస్తోం-ఎయిర్ లిఫ్ట్ అంటూ మూడు సినిమాలు ఇచ్చి హిట్లు కూడా కొట్టేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త సినిమా 'గోల్డ్' చేస్తున్నాడు. ఈ మూవీ లోగో రిలీజ్ చేయడమే కాదు.. 2018 ఆగస్ట్ 18న వస్తోందంటూ విడుదల తేదీ కూడా చెప్పేశాడు అక్షయ్ కుమార్.

1948లో లండన్ లో 14వ ఒలింపిక్స్  జరిగాయి. దీనిలోనే స్వతంత్ర భారత దేశం తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ దేశభక్తి స్టోరీనే ఇప్పుడు అందించబోతున్నాడు అక్షయ్ కుమార్. వెనకాల భారత్ జెండా.. గోల్డ్ కలర్ లో మెరుస్తున్న 1948 ఒలింపిక్స్ మెడల్.. ఈ లోగోలో కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డ్ ఫస్ట్ లుక్ అదిరింది. ఒక్క పోస్టర్ తో చాలానే బజ్ క్రియేట్ చేసేసి.. దేశభక్తి రగిలించేస్తున్నాడు అక్షయ్ కుమార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News