అకీరా ఫేవరేట్‌ హీరో ఎవరో తెలుసా?

Update: 2020-05-11 06:45 GMT
పవన్‌ కళ్యాణ్‌.. రేణు దేశాయ్‌ ల కొడుకు అకీరానందన్‌ గురించి సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా ఇస్తే ఎవరు ఆయన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు అకీరా ఫేవరేట్‌ హీరో గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. తన తండ్రితో పాటు ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నా కూడా అకీరాకు మాత్రం చిన్న హీరో అయిన అడవి శేషు అంటే అభిమానమట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ తెలియజేసింది.

నిన్న మదర్స్‌ డే సందర్బంగా ఒక ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి వారి భవిష్యత్తు గురించి రేణు దేశాయ్‌ మాట్లాడినది. ఈ సందర్బంగా అకీరా ఇష్టా ఇష్టాలను చెప్పుకొచ్చింది. అకీరా కు అడవి శేషు అంటే చాలా ఇష్టం. అతడి ఎవరు చిత్రం చూసినప్పటి నుండి కూడా అతడికి ఫ్యాన్స్‌ అయ్యాడు. ఎక్కువగా శేషు అన్నా అంటూ అతడి గురించి అకీరా మాట్లాడుతూ ఉంటాడని రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు.

తెలుగులో హీరోగా అడవి శేషు చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా నటుడిగా రచయితగా మంచి పేరు దక్కించుకున్నాడు. గూఢాచారి మరియు ఎవరు చిత్రాలు ఆయన కెరీర్‌ లో టాప్‌ గా నిలిచాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తనయుడిని అభిమానిగా పొందినందుకు అడవి శేషు లక్కీ అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News