• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళనాడులో 'అఖండ'...

తమిళనాడులో 'అఖండ' క్లైమాక్స్ షూట్..!

By - Tupaki Desk
Update: 2021-07-23 06:34 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. వీరి కలయికలో ఇంతకముందు వచ్చిన 'సింహా' 'లెజెండ్' చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగా ఇప్పటి వరకు విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు - రెండు టీజర్‌ లకు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

'అఖండ' చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ను తమిళనాడులోని ఒక ఆలయంలో చిత్ర బృందం షూట్ చేస్తోంది. బాలకృష్ణతో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా ఈ క్లైమాక్స్ షూట్‌ లో పాల్గొంటున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని యాక్షన్ డైరెక్టర్ స్టంట్ శివ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిస్ట్ మరియు అఘోరా పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు.

ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ - జగపతిబాబు - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అఖండ' విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Tags:    
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • akhanda movie 
  • Balayya akhanda 
  • akhanda teaser 
  • akhanda movie 
  • Balayya akhanda 
  • akhanda teaser 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS