'చోర్ బజార్'లో స్టార్ డైరెక్టర్ కొడుకు..!

Update: 2021-02-18 05:42 GMT
డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ 'మెహబూబా' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'రొమాంటిక్' అనే చిత్రంలో నటిస్తున్న ఆకాష్.. తాజాగా మూడో సినిమాని ప్రారంభించాడు. "చోర్ బజార్" అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి 'జార్జ్ రెడ్డి' ఫేమ్ బి.జీవన్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. చోర్ బజార్ అనగానే దొంగిలించిన వస్తువులు దొరికే ప్రదేశం గుర్తొస్తుంది. అయితే దర్శకుడు ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా రూపొందించనున్నారని తెలుస్తోంది. విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన జీవన్ రెడ్డి.. ఈసారి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు.

"చోర్ బజార్" సినిమాని బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. వీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా వస్తున్న ఈ చిత్రాన్ని వీఎస్ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - 'లేడీస్ టైలర్' ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నాడు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సత్య గిడుటూరి ఎడిటింగ్ చేయనున్నాడు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. 'చోర్ బజార్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Tags:    

Similar News