2025 టాప్ 10 ఓటీటీ.. జియో హాట్‌స్టార్ దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ షేక్!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంటర్టైన్మెంట్ అనేది అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు థియేటర్లు, టీవీల ముందు కూర్చునే జనం ఇప్పుడు మొబైల్స్, స్మార్ట్ టీవీల్లో ఓటీటీల వైపు మళ్లుతున్నారు.;

Update: 2025-12-08 02:30 GMT

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంటర్టైన్మెంట్ అనేది అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు థియేటర్లు, టీవీల ముందు కూర్చునే జనం ఇప్పుడు మొబైల్స్, స్మార్ట్ టీవీల్లో ఓటీటీల వైపు మళ్లుతున్నారు. 2025 నాటికి ఈ స్ట్రీమింగ్ వార్ తారస్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకోవడంలో దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ గణాంకాలను చూస్తే నెట్‌ఫ్లిక్స్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, ఒక ఇండియన్ జాయింట్ దానికి గట్టి పోటీ ఇస్తుండటం విశేషం.

ఎప్పటిలాగే నెట్‌ఫ్లిక్స్ 302 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్, క్వాలిటీ వెబ్ సిరీస్ లు దీనికి ప్రధాన బలం. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. 'జియో హాట్‌స్టార్' 300 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో నెట్‌ఫ్లిక్స్ కు అతి సమీపంలోకి వచ్చేసింది. కేవలం 2 మిలియన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి, గ్లోబల్ మార్కెట్ లో భారతీయ సత్తాను చాటుతోంది. క్రికెట్, లోకల్ కంటెంట్ స్ట్రాటజీ జియో హాట్‌స్టార్ కు కలిసొచ్చింది.

మూడో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో 200 మిలియన్ల యూజర్లతో నిలిచింది. ఈ కామర్స్ డెలివరీ బెనిఫిట్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేయడం అమెజాన్ కు ప్లస్ పాయింట్. ఇక జియోతో పొత్తు లేకుండా డిస్నీ ప్లస్ ఇతర దేశాల్లో 132 మిలియన్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక హెచ్బీఓ మ్యాక్స్ 128 మిలియన్లతో ఐదో స్థానంలో ఉంది.

ఆసియా మార్కెట్ లో చైనాకు చెందిన టెన్సెంట్ (110 మిలియన్లు), ఐక్యూయి (101 మిలియన్లు) కూడా గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. లోకల్ మార్కెట్ పెద్దది కావడంతో ఇవి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఇక పారామౌంట్ ప్లస్, హులు, పీకాక్ వంటివి నిదానంగా తమ బేస్ ను పెంచుకుంటూ రేసులో నిలబడటానికి ప్రయత్నిస్తున్నాయి.

ఈ గణాంకాలను బట్టి చూస్తే.. భవిష్యత్తులో ఈ పోటీ మరింత స్ట్రాంగ్ గా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా జియో హాట్‌స్టార్ గ్రోత్ రేట్ చూస్తుంటే, త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ను దాటి నెంబర్ వన్ స్థానానికి చేరినా ఆశ్చర్యం లేదు. కంటెంట్ తో పాటు తక్కువ ధరకు సేవలు అందించడమే సక్సెస్ మంత్రంగా మారింది.

2025లో టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రైబర్ల వివరాలు

​నెట్‌ఫ్లిక్స్: 302 మిలియన్లు

​జియో హాట్‌స్టార్: 300 మిలియన్లు

​అమెజాన్ ప్రైమ్: 200 మిలియన్లు

​డిస్నీ ప్లస్: 132 మిలియన్లు

​హెచ్‌బీఓ మ్యాక్స్: 128 మిలియన్లు

​టెన్సెంట్: 110 మిలియన్లు

​ఐక్యూయి: 101 మిలియన్లు

​పారామౌంట్ ప్లస్: 79 మిలియన్లు

​హులు: 64 మిలియన్లు

​పీకాక్: 41 మిలియన్లు

Tags:    

Similar News