• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇద్దరు బడా హీరోలపై...

ఇద్దరు బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ రాజ్

By - Tupaki Desk
Update: 2019-06-08 03:55 GMT
తన విలక్షణ నటనతో దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో నటించాడు ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ.. మరోవైపు బుల్లితెరపైనా మెప్పించిన ఆయన ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. మూడు సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులో అతడు చేతి మనికట్టు చాకుతో కోసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. అయితే, ఆత్మహత్యలు అరికట్టడానికి - అవగాహన కల్పించడానికి తీసిన వీడియో అని చివర్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి పెద్దగా మీడియా ముందుకు రాని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించాడు. ఈ సందర్భంగా ఇద్దరిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 కోలీవుడ్‌కు చెందిన బడా హీరోలు అజిత్  - సూర్యపై పృథ్వీ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘అజిత్ డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా కూల్ పర్సన్. ఎవరితో ఎలా ఉండాలో.. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసిన వ్యక్తి. అయితే, అతడిలో వ్యక్తిగతంగా డెడికేషన్ అస్సలు కనిపించదు. నటించాలనే ఆసక్తి కూడా ఉండదు. అలాంటి వ్యక్తికి ఇంత స్టార్‌ డమ్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాదు. వాస్తవానికి దర్శకుడు షాట్ కోసం పిలిచినపుడు అతడు పట్టించుకోడు. అలాగే, తన నటన గురించి ప్రశంసించినపుడు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడు. అజిత్‌ కు నటన కంటే వంటలు వండటం - ఇతర పనులు చేయడంపైనే ఎక్కువ ఆసక్తి. కానీ, నేను అలా కాదు. షాట్ కోసం నాకు పిలుపు రాగానే ఎనర్జీ వచ్చేస్తుంది. అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

 అలాగే, సూర్య గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘సూర్య.. కూడా మంచి వ్యక్తే. చూడ్డానికి చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపిస్తాడు. అదే సినిమాల్లో కూడా కనిపిస్తుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అతడి పిరియడ్ ముగిసినట్లు అనిపిస్తుంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఇరు హీరోల అభిమానులు పృథ్వీ రాజ్‌ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పృథ్వీ రాజ్ తెలుగు - తమిళ - కన్నడ సినిమాలలో నటించాడు. 1990 - 2000 దశకాల్లో తమిళ టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించాడు.

 1997లో వచ్చిన ‘‘పెళ్ళి’’ సినిమాకు ఉత్తమ విలన్‌ గా నంది అవార్డు అందుకున్నాడు. దీనికి ముందూ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించాడు. అయితే, సినిమా అవకాశాలు తక్కువైనప్పుడు ఒక సంవత్సరం పాటు జోడీ నంబర్ వన్ అనే డ్యాన్స్ రియాలిటీ షో - రెండో సీజన్‌ లో పాల్గొన్నాడు. షో జరుగుతున్నప్పుడే దానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న శింబుతో వివాదానికి దిగాడు. 2010 నుంచి ఎక్కువగా టీవీ మీదనే తన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణ భారత దేశంలోనే బడా హీరోలుగా వెలుగొందుతున్న ఇద్దరు అగ్ర నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు.


Tags:    
  • Ajith 
  • Suriya 
  • Prithviraj 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS