తమిళ సినిమాల గురించి పొగడ్డం వరకు ఓకే కానీ.. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడటం ద్వారా వివాదంలో చిక్కుకున్నాడు నటుడు అజయ్ ఘోష్. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఈ గొడవ ముందు వరకు ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు. కానీ ఆ వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు ఘోష్. ఆయనపై సోషల్ మీడియాలో చాలామంది మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై అభ్యంతరాల నేపథ్యంలో అజయ్ ఘోష్ వివరణ ఇచ్చారు. క్షమాపణ కూడా చెప్పారు. ఇంతకీ ఘోష్ ఏమన్నారంటే..
‘‘దక్షిణ భారత దేశ సినిమాకి మొదలు అయిన తమిళ సినిమాను మనస్పూర్తిగా పొగిడాను తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. నాకు మొదట అన్నం పెట్టింది తెలుగు సీరియల్స్. అలాంటిది తెలుగు తల్లిని నేను ఎప్పుడూ కించపరచను. చాలా ఏళ్లుగా హైదరాబాద్ లో ఉంటూ నానా కష్టాలు పడుతూ.. అవమానాలు భరిస్తూ తెలుగు సినిమాల్లో సరైన అవకాశం కోసం ఎదురు చూశాను. కానీ మనవాళ్లు పట్టించుకోలేదు. వచ్చిన చిన్న చిన్న అవకాశాల్ని ఉపయోగించుకుంటూ వెళ్తున్న సమయంలో నా టాలెంట్ చూసి విసారణై లాంటి గొప్ప సినిమాలో తమిళ దర్శకుడు అవకాశం కల్పించారు. మరెన్నో మంచి సినిమాల్లో అవకాశాలు దక్కాయి. తెలుగులోనూ అవకాశాలు పెరిగాయి. నేను చెన్నైలో జరిగిన ఓ తమిళ సినిమా ఆడియో వేడుకలో సరాదాగా మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించిన వెబ్ సైట్లకి.. మిగతా వ్యక్తులకు నా శతకోటి వందనాలు. ఇలాంటి వ్యక్తులకి నేను అస్సలు భయపడను. నేను ఎలాంటి వ్యక్తినో నా తెలుగు సహ నటులకు.. నా స్నేహితులకు.. నా తెలుగు పరిశ్రమకు తెలుసు. నా వల్ల ఏ తెలుగు వ్యక్తికైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’ అని అజయ్ ఘోష్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/