అస‌లు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని వైర‌స్!

Update: 2023-04-30 14:00 GMT
దివి వ‌ద్య‌త‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బిగ్ బాస్ తెలుగు హౌస్ మేట్ గా దివికి తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు. స్టార్ హీరోలు సైతం దివితో ప్రేమ‌లో పడిపోయామ‌ని వేదిక‌ల‌పై పొగిడేస్తున్నారంటే ఈ బ్యూటీ ప్రభావం ఎంత‌గా ఉందో అర్థం చేసుకోవాలి. త‌నదైన యూనిక్ స్టైల్ సెన్స్ తో హృదయాలను ఎలా కొల్ల‌గొట్టాలో తెలిసిన భామ‌గా దివి గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంటుంది.

దివి సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం ఎంతో యాక్టివ్ గా ఉంది. ఇటీవ‌ల‌ మత్స్యకన్యలా బీచ్ ప‌రిస‌రాల్లో అద్భుత‌మైన ఫోటోషూట్ తో మైమ‌రిపించింది. నిజంగానే మ‌త్స్యం ఒడ్డుకు కొట్టుకొచ్చిందా? అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు చాలా మంది. అంత‌గా దివి అంద‌చందాలు క‌ట్టి ప‌డేసాయి.  ఇటీవ‌ల ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.  పాశ్చాత్యం లేదా సాంప్రదాయ దుస్తులను ధరించినా లేదా ఇంకేదైనా ప్ర‌యోగాత్మ‌క రూపంతో ఆక‌ట్టుకున్నా దివి లోని యూనిక్ నెస్ కుర్ర‌కారును ఇట్టే ఆక‌ర్షిస్తుంది.

సాగ‌ర క‌న్య ఇంత‌లోనే ఇప్పుడు మ‌రోసారి ట్రెడిష‌న‌ల్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చి యువ‌త‌ను ప్ర‌స‌న్నం చేసుకుంది. దివి సాంప్రదాయ రూపం మ‌రోసారి యూత్ ని క‌ట్టి ప‌డేసింది. దివి వ‌ద్య‌త తాజాగా పారాణి పెట్టుకున్న చేతుల‌ను చూపిస్తూ బాగా పండిందా? అంటూ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చింది. నీ రాక కోసం నేను నా పారాణి ఎదురు చూస్తున్నాము! అంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసింది. ఈ అంద‌మైన ఫోటోషూట్ యువ‌త‌రంలోకి వైర‌ల్ గా మారింది. దివి ఒక‌వేళ ప్రేమ‌లో ప‌డిందా? అని కొంద‌రు సందేహం వ్య‌క్తం చేస్తుండగా.. అస‌లు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ద‌ని కొంద‌రు త‌మ ప్రేమ‌ను వ్య‌క్తం చేసారు.

దివి ఇటీవ‌ల వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇంత‌కుముందు మ‌హ‌ర్షి-గాడ్ ఫాదర్ వంటి విజయవంతమైన చిత్రాలలో న‌టించింది. గిన్నాలోను ఆక‌ట్టుకుంది.  క్యాబ్ స్టోరీస్- మా నీళ్ల ట్యాంక్ - ATM వంటి పాపుల‌ర్ టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది. ఆమె చివరిగా `ది యాక్సిడెంట్` అనే చిత్రంలో కనిపించింది. ఇప్పుడు అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో త‌దుప‌రి చిత్రం రుద్రంగి ..మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించిన సింబా- ది ఫారెస్ట్ మ్యాన్ లో నటిస్తూ బిజీగా ఉంది.

Similar News