ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఆలా చేశారంటున్న నటుడు !

Update: 2021-04-10 02:30 GMT
లోకనాయకుడు కమల్ హాసన్ .. తిరుగులేని స్టార్ డం ఉన్న హీరో. హిట్ , ప్లాప్స్ తో సంబంధంలేని హీరో. ఎంతోమంది గొప్ప గొప్ప దర్శకులతో కలిసి నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు కూడా చేశారు. భారతీయుడు , స్వాతి ముత్యం ,దశావతారం వంటి ఎన్నో గొప్ప సినిమాలు అయన సినీ కెరియర్ లో ఎన్ని ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక తమిళ స్టార్ అజిత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఎప్పుడూ ఒకే రకమైన కథలతో కాకుండా వహిభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ అభిమానులని అలరిస్తుంటారు. ఈ ఇద్దరికి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే , తాజాగా కమల్ హాసన్ , అజిత్ భరతనాట్యానికి తీరని ద్రోహం చేశారని నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్‌ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రముఖ భరతనాట్య కళాకారి అయిన సాయి శ్రీరామ్ గత 30 ఏళ్లుగా ఆ కళామతల్లికి సేవలందిస్తున్నారు. తాజాగా భరతనాట్యం ఇతివృత్తంతో 'కుమారసంభవం' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికే ఈయనే కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, నృత్యం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చేపట్టి కథానాయకుడిగా కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖితా మీనన్, సాయి అక్షిత, మీనాక్షి అనే ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. ఈ కుమారసంభవం సినిమా త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతుంది.  

ఈ సందర్భంగా సాయి శ్రీరామ్‌ గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ,తనతో పాటు తన తండ్రి పీకే.ముత్తు కూడా భరత నాట్య కళాకారుడని , ఆయన కొన్ని చిత్రాలకు నృత్య దర్శకుడిగానూ పని చేశారని తెలిపారు. అయితే కొన్నేళ్లుగా భరత నాట్య కళను కించపరిచే విధంగా సినిమాలు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణలు కూడా చెప్పారు. వరలారు చిత్రంలో నటుడు అజిత్‌ భరతనాట్యం నేర్చుకోవడం వల్లే తనకు వివాహం కాలేదని చెప్పారు.అలాగే ,హీరో కమల్‌ హాసన్‌ భరతనాట్య కళాకారుడు కావడం వల్లే భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయినట్లు చిత్రీకరించారన్నారు. అలా భరత నాట్య కళాకారుడిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రారనే తప్పుడు సంకేతాలను సినిమాలు ద్వారా సమాజానికి  కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి అపోహలను పోగొట్టడానికే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు.
Tags:    

Similar News