అమృత, ప్రణయ్ లవ్ స్టోరీ పై సినిమా

Update: 2020-03-10 04:02 GMT
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న న్యూస్ కూతురు అమృత కారణంగా ‘మారుతీరావు ఆత్మహత్య’ ఇష్యూ. ఈ ప్రేమ పగ ఉదంతం మీదే ఇప్పుడంతా చర్చ మొదలైంది.

నల్గొండ జిల్లా మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన ప్రణయ్ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతురు భర్తను వ్యాపారవేత్త మారుతీరావు చంపించాడు.ఈ ఉదంతంలో కూతురు అమృత తండ్రికి ఎదురుతిరగడం.. కోర్టులో మారుతీరావు విచారణ ఎదుర్కొంటుండడం.. తాజాగా సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.

ఒక గొప్ప ప్రేమ కథ ఎంతో విషాదమైన అంతానికి దారితీసిందో అమృత లవ్ స్టోరీ అందరికీ చూపించింది. వీరి ప్రేమ కథ స్ఫూర్తితో తాజాగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ అమృత-ప్రణయ్ నేపథ్యంలో తీస్తున్న మూవీలో హీరోగా బాలాదిత్య, అర్చన కీరోల్స్ పోషిస్తున్నారు. జమున అన్నపూర్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాస్టర్ రవితేజ మరో కీలక పాత్ర పోషించాడు.

దీనిపై హీరో బాలాదిత్య మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమ కథ స్ఫూర్తితో దర్శకుడు శివనాగేశ్వరరావు ఎంతో హార్ట్ టచింగ్ , ఎమోషనల్ గా సినిమా తీశాడని.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు.
Tags:    

Similar News