అవమానాల చిట్టా విప్పిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ లో అతనితో సూపర్ స్టార్ ఫ్యామిలీ... అయినా సరే అతనికి అవమానాలు తప్పలేదు. తండ్రి జగమెరిగిన సూపర్ స్టార్.. కానీ ఆ స్టార్‌డమ్.. అతన్ని అవమానాల నుంచి కాపాడలేకపోయింది. ఇండస్ట్రీ వర్గాల నిరాదరణ నుంచి బయటపడేయలేకపోయింది. దారుణమైన అవమానాలని ఎదుర్కొనేలా చేసింది. ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల తనయుడు అభిషేక్ బచ్చన్. గత కొంత కాలంగా తను ఇండస్ట్రీలో దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నానని తాజాగా తనకు జరిగిన అవమానాల చిట్టా విప్పడం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తనకు జరిగిన అవమానాలన్నీ వృత్తిలో భాగమని సరిపెట్టుకున్నానని, రాను రాను పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం మొదలుపెట్టానని ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. చాలా సందర్భాల్లో సినిమాల్లో నుంచి తొలగించి నా స్థానంలో మరొకరిని తీసుకున్నారని, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మేకర్స్ నుంచి సమాధానం లభించలేదని, తనతో మాట్లాడటానికి కూడా ఎవరూ ఇష్టపడలేదని వాపోయాడు అభిషేక్. ఈ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన అవమానకర సందర్భాలని చెప్పుకొచ్చాడు.
చాలా సినిమాల్లో తనని సంప్రదించకుండానే మార్చేశారని, చెప్పిన టైమ్ కి షూటింగ్ కి వెళ్లినా అక్కడ నా స్థానంలో మరొకరు కనిపించేవారని, దాంతో చేసేది లేక నిశ్శబ్దంగా అక్కడి నుంచి తిరిగి వెళ్లానని, ఇలాంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయని వివరించాడు. అంతే కాకుండా నా లాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో వున్న చాలా మంది హీరోలకు ఎదురవుతుంటాయని, మా నాన్ని కూడా ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చాడు. బిజినెస్ కి సంబంధించిన అంశాలని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ తనని తప్పించారని అర్థమైంది. అలా చేసే హక్కు వారికి వుంది అని గ్రహించాను` అని తెలిపారు.
ఓ పబ్లిక్ ఫంక్షన్ కి వెళితే అక్కడ తన పరిస్థితి ఎలా వుండేదో ఈ సందర్భంగా వెల్లడించాడు అభిషేక్. `ఓ పబ్లిక్ ఫంక్షన్ కి వెళితే అక్కడి వారు నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టారనుకొండి అది చూసి నేను వావ్ అని ఫీలయ్యేవాడిని కానీ ఆ వెంటనే ఆ ఫంక్షన్ కి ఎవరైనా బిగ్ స్టార్ వస్తే సర్ మీరు లేచి వెనకాల కూర్చోండి అన్నంత పని చేసేవారు ఇవన్నీ చూసి చాలా బాధగా వుండేది. ఇంలాంటి అవమానకర పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఏ వ్యక్తికైనా , నటుడికైనా దాన్ని అధిగమించే స్థాయిలో వుండాలని.. నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగి ఇలాంటి అవమానాలు జరక్కుండా చూసుకోవాలని ప్రతిష్ట చేయడం తప్ప ఇంకేముంటుంది` అని తన బాధని వెల్లగక్కాడు అభిషేక్. అభిషేక్ నటించిన తాజా చిత్రం `బాబ్ బిస్వాస్`. ఈ మూవీ ఇటీవలే జీ5లో స్ట్రీమింగ్ అయింది.