కంగనకి సపోర్ట్ గా ఖాన్!!

Update: 2017-10-17 17:41 GMT
బాలీవుడ్ లో ఒక హీరోయిన్ స్టార్ హోదాను అందుకోవాలంటే  సామాన్యమైన విషయం కాదు. మొదట మోడల్స్ గా నిలదొక్కుకొని ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హీరోయిన్స్ గా అవకాశాలు దక్కించుకోవాల్సి వస్తోందని ఇప్పటికే చాలామంది హోరోయిన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే తాను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చినదాన్నని కంగనా రనౌత్ కూడా చాలాసార్లు చెప్పింది.

అంతే కాకుండా ఆమె హృతిక్ రోషన్ అలాగే కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు చాలా వేదించారని చెప్పడంతో బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో లో ఆ న్యూస్ వైరల్ అయ్యింది. అయితే హృతిక్ కి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతును ఇచ్చారు. కానీ కంగనా కి మాత్రం ఎవ్వరు సపోర్ట్ గా నిలవడం లేదు. ఆమె సిస్టర్ రంగోలి మాత్రం ఎప్పటికప్పుడు విమర్శలకు కౌంటర్లు వేస్తోంది. కానీ కంగన మాత్రం ఎలాంటి విషయాలనూ పట్టించుకోవడం లేదని ఆమె ప్రస్తుతం తన మణికర్ణిక సినిమాపైనే దృష్టి పెట్టిందని కొందరు కామెంట్స్  చేస్తున్నారు. కంగనపై నిన్న మొన్న దగ్గరగా ఉన్నవాళ్లు కూడా హృతిక్ కి సపోర్ట్ చేస్తూ తనను నిందించడం తట్టుకోలేకపోతోందట. ఒక్కోసారి చాలా డిప్రెషన్ లోకి వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక విషయం ఏంటంటే.. ఆమెకు అండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అమీర్ ఖాన్ ఒక్కరు కంగనకు సపోర్ట్ గా ఉన్నారని ఎందుకంటే ఆమెను అమీర్ సెక్రెట్ సూపర్ స్టార్ స్పెషల్ షోకి ఇన్వైట్ చేశారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆ షోకి కేవలం సినిమాకి సంబంధించిన వారు మాత్రమే హాజరవుతున్నారంట కానీ అమీర్ మాత్రం కంగనని పిలిచారని తెలుస్తోంది. మొత్తంగా అమీర్ ఖాన్ -  కంగన కి సపోర్ట్ చేస్తున్నారా అనే విధంగా ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News