పాలిటిక్స్ పై పెదవి విప్పిన పర్ఫెక్షనిస్ట్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.. తాజాగా 52వ జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. దంగల్ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమిర్.. తన బర్త్ డే సందర్భంగా అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.
బర్త్ డే రోజున ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమిర్ ఖాన్.. రాజకీయాలపై మాట్లాడడం ఆసక్తిని కలిగించింది. అయితే.. తాను పాలిటిక్స్ లోకి రాబోనని చెప్పాడు ఆమీర్ ఖాన్. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకు లేదని తేల్చేశాడీ స్టార్ హీరో. పాలిటిక్స్ లోకి రాకపోయినా.. ప్రధానమైన అంశాలపైనా.. తనను కదిలించిన టాపిక్స్ పైనా.. ఎప్పటికప్పుడు తన భావాలను ఉద్దేశ్యాలను తెలియచెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడబోనని చెప్పాడు ఆమీర్.
అలాగే తన అభిప్రాయాలను వెల్లడించేటపుడు నిర్లక్ష్యంగా ఉండబోనని అంటున్నారు ఆమిర్ ఖాన్. తాను ఓ ఆర్టిస్ట్ నని.. కళాకారుడిగా దేశానికి చేయాల్సింది ఎంతో ఉందన్న ఆమిర్.. తన దృష్టంతా కళా రంగం పైనే పెడతానని అన్నాడు. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చేశాడు ఆమిర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/