ఐదు సినిమాలతో 2 వేల కోట్లు కొల్లగొట్టాడు
అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే.. పాత రికార్డులు బద్దలవ్వాల్సిందే. కొత్త రికార్డులు నమోదవ్వాల్సిందే. విశేషం ఏంటంటే.. అమీర్ బద్దలు కొట్టే పాత రికార్డు కూడా అతడిదే అయి ఉంటుంది. దశాబ్ద కాలం నుంచి అమీర్ ఖాన్ రికార్డు నెలకొల్పడం.. దాన్ని బద్దలు కొట్టడం ఆనవాయితీగా మారిపోయింది. 2008లో ‘గజిని’ సినిమాతో ఇండియాలో తొలి రూ.200 కోట్ల సినిమాను అందించాడు అమీర్. తర్వాతి ఏడాదే ఆ రికార్డును బద్దలు కొడుతూ ‘3 ఇడియట్స్’తో రూ.400 కోట్లకు చేరువగా వచ్చాడు. ఈ రికార్డు నాలుగేళ్ల పాటు నిలిచింది. ఇంకే బాలీవుడ్ సినిమా కూడా ‘3 ఇడియట్స్’ రికార్డును టచ్ చేయలేకపోయింది.
2013లో మళ్లీ ‘ధూమ్-3’ తన రికార్డును తనే బద్దలు కొట్టాడు అమీర్. ఆ చిత్రం రూ.530 కోట్లు కొల్లగొట్టింది. తర్వాతి ఏడాది మళ్లీ అమీరే తన రికార్డుల పని పట్టే బాధ్యత తీసుకున్నాడు. ‘పీకే’తో ప్రపంచ వ్యాప్తంగా రూ.730 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించాడు. ఇప్పుడు ‘దంగల్’ ఇప్పటికే రూ.500 కోట్లకు చేరువైంది. ఈ సినిమా ‘పీకే’ రికార్డుల్ని దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలతో రూ.2 వేల కోట్ల మార్కును అందుకున్నాడు అమీర్. మరే స్టార్ కూడా అతడికి దరిదాపుల్లో లేడు. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్ కు చాలా దూరంలో ఉన్నారు. వాళ్లు రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నారు. అమీర్ మాత్రం తనతో తనే పోటీ పడుతూ.. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకెళ్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/