ఎ వాక్ విత్ పూనమ్ కౌర్ పాక్ లో హిట్!

Update: 2018-12-17 07:34 GMT
తెలుగువారికి పరిచయం అక్కరలేని పేరు పూనమ్ కౌర్.  హీరోయిన్ గా తెచ్చుకున్న పాపులారిటీ కంటే ఇతర విషయాలలో ఆమె సోషల్ మీడియా ఖతాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువ. ఈమధ్య పూనమ్ ఒక మంచిపని చేయడమ ద్వారా పాకిస్తాన్ లో కూడా పాపులర్ అయింది.

పాకిస్తాన్ లో ఉన్న కర్తార్ పూర్ గురుద్వారా చాలా ఫేమస్. అక్కడ సిక్కుమత స్థాపకుడు గురునానక్ నివసించిన ప్రదేశం అది. ఈమధ్య భారత పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు జరిగి కర్తార్ పూర్ మార్గం ఓపెన్ చెయ్యడంతో భారతదేశంలోని చాలామంది సిక్కు మతస్తులు అక్కడకు వెళ్ళి గురుద్వారాను దర్శించుకుంటున్నారు. పూనమ్ అలా కర్తార్పూర్ కు వెళ్ళడమే కాకుండా  'ఎ వాక్ విత్ పూనమ్ కౌర్' పేరుతో ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కించింది.  డాక్యుమెంటరీ లా ఉండే ఈ షార్ట్ ఫిలిం 4.36 నిమషాల నిడివి ఉంది.  ఈ షార్ట్ ఫిలిం ను పాకిస్తాన్ కు చెందిన పీ టీవీ లో కూడా ప్రసారం చేశారు.

దీంతో ఇరు దేశాలకు చేసిన సిక్కు మతస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ సిక్కు సమాజంలో పూనం ఇప్పుడు చాలా పాపులర్ అయింది.   పూనం నవంబర్ 21-30 తేదీల మధ్యలో అక్కడికి వెళ్ళిందని సమాచారం.  అంతా బాగానే ఉంది గానీ అక్కడ పీటీవీ వారు పూనమ్ ను తమిళ నటి అనుకుంటున్నారు. ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి గానీ అవన్నీ పట్టించుకోకుండా మీరూ ఆ షార్ట్ ఫిలిం పై ఒక లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News