సుహాస్ డైరెక్టర్ పై తారక్ కు అంత నమ్మకమా?

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా పలు సినిమాలకు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు.. దర్శకులుగా మారి అదరగొడుతున్నారు

Update: 2024-05-06 03:15 GMT

టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా పలు సినిమాలకు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు.. దర్శకులుగా మారి అదరగొడుతున్నారు. తమ టాలెంట్ తో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ మూవీలతో బ్లాక్ బస్టర్లు హిట్లు కొడుతున్నారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఆ లిస్ట్ లోకి రీసెంట్ గా డైరెక్టర్ అర్జున్ వీకే యాడ్ అయ్యారు.

యువ కథానాయకుడు సుహాస్ హీరోగా అర్జున్ వీకే తెరకెక్కించిన ప్రసన్నవదనం మూవీ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే జగడం మూవీ నుంచి సుకుమార్ వద్ద అన్ని సినిమాలకు వర్క్ చేశారు అర్జున్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. నాన్నకు ప్రేమతో చిత్రానికి కూడా పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ మెమోరీస్ ను తాజాగా షేర్ చేసుకున్నారు అర్జున్ గురువు సుకుమార్.

రీసెంట్ గా డైరెక్టర్ సుకుమార్ తో పాటు ఆయన శిష్యుడు, దర్శకుడు బుచ్చిబాబు... అర్జున్ వీకే, సుహాస్ ను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని అర్జున్ పై ప్రశంసలు కురిపించారు సుకుమార్. ఆ మూవీ సమయంలో అర్జున్ పై ఎన్టీఆర్ కు చాలా నమ్మకం కలిగిందని చెప్పారు. సినిమాలోని మేజర్ ఎపిసోడ్ ను అర్జున్ షూట్ చేశారని తెలిపారు.

తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ మేజర్ సీన్ ను షూట్ చేస్తారంటే.. తారక్ ఎస్ చెప్పడం మామూలు విషయం కాదని తెలిపారు సుకుమార్. అక్కడే అర్జున్ టాలెంట్ ఏంటో అర్థమవుతుందని కొనియాడారు. అతడు షూట్ చేసిందే మూవీలో ఉందని, మళ్లీ తానేం రీషూట్ చేయలేదని సుక్కు మాస్టర్ వెల్లడించారు. 2016లో విడుదలైన నాన్నకు ప్రేమతో మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read more!

ఇక సుకుమార్ మూడో సినిమా అల్లు అర్జున్ ఆర్య-2లో కూడా ఓ సీన్ కు అర్జున్ దర్శకత్వం వహించారని సుక్కు తెలిపారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో అర్జున్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు సుకుమార్. అర్జున్ రాసే సినిమా స్టోరీల్లో లాజిక్ బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు అతడు డైరెక్టర్ గా మారడం వల్ల.. తాను లాజిక్ మూవీస్ తీయడం మానేశానని తెలిపారు. దీంతో అర్జున్ ప్రతిభేంటో ఈజీగా అర్థమవుతుంది. మరి అర్జున్.. ఫ్యూచర్ లో ఎలాంటి అవకాశాలు అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News