మ‌ణిర‌త్నం- రెహ‌మాన్ 'ఉత్త‌మ సంగీతం' వెన‌క సీక్రెట్

రోజా, బొంబాయి, కాద‌ల్, ఓకే క‌న్మ‌ణి.. ఇంకా ఎన్నో చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేసారు ఏ.ఆర్.రెహ‌మాన్- మ‌ణిర‌త్నం కాంబినేష‌న్.;

Update: 2025-05-30 03:49 GMT

రోజా, బొంబాయి, కాద‌ల్, ఓకే క‌న్మ‌ణి.. ఇంకా ఎన్నో చిత్రాల‌కు క‌లిసి ప‌ని చేసారు ఏ.ఆర్.రెహ‌మాన్- మ‌ణిర‌త్నం కాంబినేష‌న్. ఇప్పుడు కొంత గ్యాప్ త‌ర్వాత `థగ్ లైఫ్` కోసం వారిద్దరూ మరోసారి కలిసి పనిచేసారు. క‌మ‌ల్ హాస‌న్, శింబు, త్రిష లాంటి అగ్ర తార‌లు ఈ చిత్రంలో న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

త్వ‌ర‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో ఏ.ఆర్.రెహ‌మాన్ త‌న సుదీర్ఘ కెరీర్ జ‌ర్నీలో మ‌ణిర‌త్నంతో త‌న‌కు సింక్ గురించి ప్ర‌స్థావించారు. థగ్ లైఫ్ సంగీతానికి సంబంధించిన అన్ని కంపోజిష‌న్స్ పూర్త‌య్యాయి. కానీ చివ‌రి నిమిషంలో ర‌త్నం ఒక స‌న్నివేశంలో ఫ‌లానా చోట దూకుడు పెంచ‌గ‌ల‌మా? అని అడిగారు. అప్ప‌టికి సౌండ్ ఇంజినీర్ వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నాడు. అత‌డు వెళ్లిపోవ‌డానికి గంట ముందు, నేను స్టూడియోకి వెళ్లి ఆ ప‌ని పూర్తి చేసాను. మా మ‌ధ్య సింక్ అలాంటిది అని తెలిపారు.

ప్రేక్ష‌కులకు, సినిమాకు సేవ చేయ‌డ‌మే మా ఇద్ద‌రి ప‌ర‌మావ‌ధి. నేను జింగిల్ పరిశ్రమలో నన్ను నేను కనుగొన్నాను. అతడు (మ‌ణిర‌త్నం) నా ఎదుగుదలను చూశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయ‌న‌ అక్కడే ఉన్నాడు. నేను `బాంబే డ్రీమ్స్` సినిమాకి చేస్తున్నప్పుడు, ఆయ‌న‌ సంగీతం కోసం లండన్‌కు వచ్చేవాడు. అయితే అతడు (మ‌ణిరత్నం) బాలీవుడ్‌కు రాలేదు. నేను నా వర్చువల్ రియాలిటీ పనులు చేస్తున్నప్పుడు..దానిని చూసి కామెంట్ చేసేవారు! అంటూ త‌మ మ‌ధ్య ట్రావెల్ గురించి రెహ‌మాన్ వెల్ల‌డించారు.

ఇటీవ‌లే థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఆల్బమ్‌లో పాటలు జింగుచా, షుగర్ బేబీ, ముత్త మళై , విన్‌వేలి నాయగ ఆక‌ట్టుకున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నేప‌థ్య సంగీతం మ‌రో లెవ‌ల్ లో ఉంటుంద‌ని ట్రైల‌ర్ ఇప్ప‌టికే నిరూపించింది. తెలుగు పాట‌లు ఏమేర‌కు మెప్పిస్తాయో థియేట‌ర్ల‌లోనే ప‌రిశీలించాలి.

Tags:    

Similar News