నైట్ పాడించి డబుల్ పేమెంట్ ఇచ్చే ఏకైక వ్యక్తి!
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ? ఏ.ఆర్ రెహమాన్. అందులో ఎలాంటి డౌట్ లేదు.;
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ? ఏ.ఆర్ రెహమాన్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆధారంగా ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు. ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా? ఇండియాలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు లేదు పోటీ. మ్యూజిక్ పరంగా రెహమాన్ కున్న బ్రాండ్ ఇమేజ్ అది. అంతే అప్ డేట్ గానూ ఉంటారు. సంగీతంపై కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఆయనకే చెల్లింది. ఇదంతా ఒకే.
మరి రెహమాన్ మ్యూజిక్ ట్రూప్ సంగతేంటి? అంటే ఆయన టీమ్ కూడా అంతే అడ్వాన్స్ గా ఉంటుందట. కొత్త కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రెహమాన్ టీమ్ కూడా ఎంతో అడ్వాన్స్ గా ఉంటుందిట. విదేశీ మ్యూజిక్ తో అప్ డేట్ అవ్వడం... మార్కెట్ లోకి వచ్చిన కొత్త పరికరాలతో ప్రయోగాలు చేయడంలో రెహమాన్ కంటే ముందు తన టీమ్ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది. రెహమాన్ తన టీమ్ లో ఉన్న అందరికీ భారీ మొత్తంలో జీతాలు చెల్లిస్తుం టారట.
నెల అయ్యే సరికి ఎవరి ఖాతాల్లో వారికి జీతాలు పర్పెక్ట్ గా జమ అవుతాయట. అలాగే సింగర్ల విషయంలో కూడా రెహమన్ అంతే బాధ్యతగా ఉంటారుట. ఎక్కువగా ఆయన ఏ సినిమాకు పాటలు పాడించాలన్నా? అది రాత్రిపూటే జరుగుతుందట. ఈ విషయాన్ని గాయకులు మనో తెలిపారు. ఆయన స్టూడియోలో పాటలు పాడటం అన్నది రాత్రి ఏ సమయంలోనైనా జరగొచ్చు అన్నారు. ఏ సమయలోనైనా రెహమాన్ అంతే యాక్టివ్ గా పనిచేస్తారన్నారు.
స్టూడియో కి వచ్చిన సింగర్లు నిద్రలేమితో బాధపడినా? రెహమన్ ఉత్సాహంతో పనిచేయిస్తారుట. అలాగే వాళ్లకు చెల్లించే పారితోషికం కూడా డబుల్ ఉంటుందిట. రాత్రిపూట స్టూడియోకి పిలిపించి పాటలు పాడిస్తే గనుక ఇస్తాను అన్న పేమేంట్ కంటే డబుల్ పేమెంట్ ఇచ్చి పంపించడం మాత్రం ఆయనకే చెల్లిందన్నారు. పేమెంట్ విషయంలో రెహమాన్ చాలా కరెక్ట్ గా ఉంటారన్నారు.