ఏప్రిల్ బాక్సాఫీస్.. అంతా వేస్ట్ అయిపోయే!

2024లో అప్పుడే నాలుగు నెలల కంప్లీట్. కానీ సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరో మూవీ కూడా రిలీజ్ కాలేదు

Update: 2024-04-29 07:32 GMT

2024లో అప్పుడే నాలుగు నెలల కంప్లీట్. కానీ సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరో మూవీ కూడా రిలీజ్ కాలేదు. బడా హీరోలు నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టులన్నీ జులై నుంచే విడుదల కానున్నాయి. ప్రభాస్ కల్కి మూవీ జులై 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అక్కడికి 14 రోజుల తర్వాత అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ కానుంది. అలా వరుసగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అయితే సంక్రాంతి తర్వాత పలు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే. అందులో కొన్ని సూపర్ హిట్ అవ్వగా.. మరికొన్ని తేలిపోయాయి. గత నెలలో విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం గామి మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు రిలీజ్ అయినా.. బాక్సాఫీస్ వద్ద సందడే లేదు. ఏప్రిల్ 5వ తేదీన స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ.. యూత్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మే నెలలో రిలీజ్ అవ్వాల్సిన కల్కి మూవీ పోస్ట్ పోన్ అయింది. కానీ పలు చిన్న, మీడియం రేంజ్ చిత్రాలు రానున్నాయి.

మే ఫస్ట్ వీక్ లో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ ప్రసన్నవదనం, బాక్, శబరి తో పాటు పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్నవదనంపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. రెండో వారంలో డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ మాత్రమే విడుదల అవ్వనుంది. ఇక మూడో వారంలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు కాజల్ అగర్వాల్ సత్యభామ చిత్రాలు రానున్నాయి.

Read more!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్ చూశాక బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ చేసేశారు సినీ ప్రియులు. ఇక నాలుగో వారంలో సుధీర్ బాబు హరోం హర, దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ లవ్ మీ మూవీలు రానున్నాయి. ఈ రెండు సినిమాలపై మినిమమ్ బజ్ ఉంది.

అయితే మేలో పెద్ద సినిమాల రిలీజ్ లు లేకపోవడంతో చిన్న, మీడియం రేంజ్ హీరోల చిత్రాలదే హవా. కాస్త పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు.. మంచి హిట్ అవుతాయి. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబడతాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆ ఒక్కటీ అడక్కు, లవ్ మీ వంటి పలు చిత్రాలు హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి నెలకొంటుంది. లేకుంటే మే కూడా ఏప్రిల్ లా వేస్ట్ అయిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News