• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైగర్ నాగేశ్వరరావులో.....

టైగర్ నాగేశ్వరరావులో.. సెంటిమెంట్ యాక్టర్

| ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా అనుపమ్ ఖేర్ విభిన్నంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-14 12:15 GMT

స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరపైకి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్ తోనే హై రేంజ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది.


ఇక సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్లాన్ ఇండియా రేంజ్ లోనే వైరల్ అయ్యేలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఎప్పుడు వస్తుందా అని మాస్ రాజా ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు టీజర్ ఈ నెల 17న విడుదల కానుంది.

ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ రిచ్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా నిర్మించారు. వరుసగా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో మార్కెట్ లో డిమాండ్ అయితే గట్టిగానే పెరిగింది. టీజర్‌ను విడుదల చేయడానికి ముందు మేకర్స్ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

ప్రొడక్షన్ హౌస్‌లో గతంలో వచ్చిన రెండు సినిమాల్లో భాగమైన అనుపమ్ ఖేర్ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్ర పోషిస్తున్నారు.అతను IB ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా సినిమాలో నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు.

ఇక సౌత్ ఇండస్ట్రీలో కూడా ఆయన ఇప్పుడు బిజీ అయ్యేలా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా అనుపమ్ ఖేర్ విభిన్నంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.

రవితేజ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంక యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున, మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు.అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత. దసరాకు అక్టోబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రంలో రవితేజ సరసన నూపూర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.

Tags:    
  • Tigernageshwarrao 
  • Anupamkher 
  • Abhishekagarwal 
  • Latestmovie 
  • Staractor 
  • Thekashmirfiles 
  • Karthikeya2 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS