అనుపమ బౌన్స్ బ్యాక్ ఛాన్సులు..!

లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అయినా కూడా అనుపమకి ఏమాత్రం లాభం చేకూరలేదు.;

Update: 2025-04-27 16:55 GMT

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా అయ్యే ఛాన్స్ లు కనిపించినా అమ్మడు చేసిన కొన్ని సినిమాల వల్ల గ్రాఫ్ పడిపోయింది. మొదట్లో అనుపమని చూసి టాలీవుడ్ కి మరో స్టార్ హీరోయిన్ వచ్చిందన్న టాక్ వినబడింది. కానీ అమ్మడు మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. తెలుగులో రెండేళ్ల క్రితం ఈగల్ సినిమాలో నటించిన అనుపమ ఆ తర్వాత పెద్దగా ఛాన్స్ లు అందుకోలేదు.

లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అయినా కూడా అనుపమకి ఏమాత్రం లాభం చేకూరలేదు. ఆ తర్వాత అసలు అవకాశాలన్న మాటే రాలేదు. ఐతే తెలుగులో కాస్త గ్యాప్ రాగా.. ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేస్తూ వచ్చింది అనుపమ. రీసెంట్ గా అమ్మడు డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమాలో అనుపమ కన్నా మరో హీరోయిన్ గా నటించిన కయదు లోహార్ కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఐతే తెలుగులో అనుపమ కెరీర్ ఇక దాదాపు ముగిసింది అనుకునేలోగా మళ్లీ వరుస ఛాన్స్ లు అమ్మడి తలుపు తడుతున్నాయి.

అనుపమ ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న కిష్కింధపురి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కొన్నాళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు టైటిల్ లాక్ చేసి ఒక పోస్టర్ కూడా వదిలారు. ఆల్రెడీ అనుపమ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు సినిమా చేసింది. ఆ సినిమా సక్సెస్ అందుకుందని తెలిసిందే.

మరోపక్క యువ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది అనుపమ. శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న పీరియాడికల్ సినిమాలో అనుపమ హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఈమధ్యనే ఓదెల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపత్ నంది. ఈసారి తన డైరెక్షన్ లో సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యాడు. సంపత్ నంది శర్వానంద్ కాంబో సినిమా 1965 కాలం నాటి కథతో వస్తుందని తెలుస్తుంది.

సో పీరియాడికల్ కథ, క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఇది అనుపమకి కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు. అనుపమ మాత్రం తిరిగి మళ్లీ తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఈ ప్రయత్నంలో అమ్మడికి ఎలాంటి ఫలితాలు అందుతాయన్నది చూడాలి.

Tags:    

Similar News