యువ హీరోతో అనుపమ పరమేశ్వరన్ డేటింగ్?
మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో అనుపమ - ధ్రువ్ మధ్య షేర్డ్ ప్లే జాబితాను నెటిజనులు గుర్తించిన తర్వాత ఈ ఫోటో లీక్ అయింది.;
`ప్రేమమ్` సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ కి తెలుగు ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల కోలీవుడ్ లోను వరుస చిత్రాలలో నటిస్తోంది. ఇలాంటి సమయంలో అనుపమ తన కోస్టార్ ధృవ్ విక్రమ్‌తో డేటింగ్ ప్రారంభించిందంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ జంట ఘాఢంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి తాజాగా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ ఫోటో చూడగానే, నెటిజనులు షాక్ కి గురయ్యారు. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారా? అని ఆశ్చర్యపోయారు.
మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫైలో అనుపమ - ధ్రువ్ మధ్య షేర్డ్ ప్లే జాబితాను నెటిజనులు గుర్తించిన తర్వాత ఈ ఫోటో లీక్ అయింది. కానీ ప్లేజాబితాలోని పాటలు నెటిజన్లను ఆకర్షించలేదు. దానికి బదులుగా ప్లేజాబితా ఫోటో అభిమానులను రెప్ప వేయకుండా చూసేలా చేసింది. స్పోటిఫై ప్లేజాబితాలో ఎడ్ షీరన్, ర్యాన్ గోస్లింగ్, జస్టిన్ హర్విట్జ్ సహా పలు హిట్ పాటలు ఉన్నాయి. ఈ ఫోటో వైరల్ కావడంతో, నెటిజనులు రకరకాలుగా ఊహిస్తున్నారు.
నిజానికి ఈ జోడీ `బైసన్` అనే తమిళ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆశించిన బజ్ లేదు. దీంతో బజ్ తెచ్చేందుకు ఇలా పబ్లిసిటీకి దిగారని అనుమానిస్తున్నారు. అందుకే చాలా మంది ఇది పబ్లిసిటీ స్టంటా? అని ప్రశ్నించారు. ఇందులో అనుపమ - ధ్రువ్ స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు. లేదా ఇద్దరూ నిజంగా ఒకరిలో ఒకరు ప్రేమను కనుగొన్నారా? అని కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. కొందరు అభిమానులు నిజంగా అందంగా కనిపించే జంట అని పొగిడేసారు. ఈ జోడీ ఇంకా డేటింగ్ పుకార్లపైనా, లీక్ అయిన ఫోటోపైనా స్పందించలేదు.