టాలీవుడ్ లో చేతులు మారిన మ‌రో క్రేజీ ప్రాజెక్టు

టాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేకమైన బ్రాండ్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ తన వింటేజ్ స్టైల్‌తో బలమైన కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.;

Update: 2026-05-09 09:56 GMT

టాలీవుడ్‌లో ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రత్యేకమైన బ్రాండ్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల ఇప్పుడు మళ్లీ తన వింటేజ్ స్టైల్‌తో బలమైన కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన హీరో శ‌ర్వానంద్ తో చేయనున్న భారీ ఎంటర్‌టైనర్ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాత మార్పు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో నిర్మాత అనిల్ సుంక‌ర ఈ సినిమాను టేకోవర్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే పనులు పూర్తయిన ఈ సినిమాను శ్రీను వైట్ల పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నార‌ట. గత కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీను వైట్లకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన దూకుడు, రెడీ, కింగ్ తరహా వినోదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ రెండింటినీ బాగా ఉపయోగించేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో శర్వానంద్‌కు ఫుల్ లెంగ్త్ కమర్షియల్ కామెడీ హిట్ ఇవ్వాలని డైరెక్ట‌ర్ బలంగా ఫోకస్ చేస్తున్నార‌ట.

ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అర‌వింద్ స్వామి పేరు కూడా వినిపించడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే పలు భాషల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న అరవింద్ స్వామి ఈ సినిమాలో నటిస్తే ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగే అవకాశ‌ముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాల్లో హీరో- విలన్ ట్రాక్‌లు ఎప్పుడూ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

మరోవైపు శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను స్పెషల్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. మ‌రోవైపు శ‌ర్వానంద్ కెరీర్ కు కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ శ్రీను వైట్ల స్టైల్‌లో వచ్చే ఎంట‌ర్టైన్మెంట్ ఇప్పుడు ఎంతవరకు కనెక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మేకర్స్ ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లి, వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. సంక్రాంతి సీజన్‌లో భారీ సినిమాల మధ్య కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. మ‌రి ఈ సినిమాతో అయినా శ్రీను వైట్ల నిజంగానే త‌న వింటేజ్ మ్యాజిక్ ను తిరిగి చేయ‌గ‌ల‌రా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News