ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్.. ప్రతి ఫ్యాన్ టచ్ అయ్యేలా..!

లేటెస్ట్ గా రిలీజైన ఆంధ్రా కింగ్ టీజర్ చూస్తే.. ఆంధ్రా కింగ్ అభిమాని అయిన హీరో.. ఓ పక్క ప్రేమించిన అమ్మాయి.;

Update: 2025-10-12 06:50 GMT

ఎనర్జిటిక్ స్టార్ రాపో రామ్ పోతినేని లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు పి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాం సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ ట్యాగ్ లైన్ తో వస్తుంది. సినిమా టైటిల్ కి తగినట్టుగానే ఒక స్టార్ అభిమాని ఎలా ఉంటాడు. ఎలా బిహేవ్ చేస్తాడు. ఎలాంటి తన అభిమాన హీరో మీద ఒక మాట రాకుండా చేస్తాడు అన్నది టీజర్ లో చూపించారు.

నైజాంలో కోసేసి, గుంటూరులో కారం పెట్టేసి..

లేటెస్ట్ గా రిలీజైన ఆంధ్రా కింగ్ టీజర్ చూస్తే.. ఆంధ్రా కింగ్ అభిమాని అయిన హీరో.. ఓ పక్క ప్రేమించిన అమ్మాయి. ఫ్యాన్ వార్స్.. ఇలా కంప్లీట్ గా ఒక మంచి ఎమోషనల్ జర్నీగా సినిమా ఉంటుందని టీజర్ తోనే చెప్పేశారు. సినిమాలో ఒక డైలాగ్ నైజాం లో కోసేసి, గుంటూరులో కారం పెట్టేసి, సీడెడ్ లో ఫ్రై చేసి, ఆంధ్రాలో పలావ్ వండేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని హీరో రామ్ చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు ఇది టైటిల్ లోనే ఆంధ్రా కింగ్ అని పెట్టారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అనిపిస్తుంది.

రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా అదిరిపోయింది. రామ్ తో ఏ హీరోయిన్ అయినా బాగుంటుంది. అందులోనూ భాగ్య శ్రీ ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకోగా అలాంటి భామ రామ్ తో జత కట్టడం ఇంకాస్త ఎంగేజింగ్ గా అనిపించింది. టీజర్ లో సినిమా కథ ఏంటన్నద్ది దాదాపు చెప్పేశాడు డైరెక్టర్. చివర్లో ఒక అభిమాని తన లైఫ్ గోల్ లేకుండా ఉంటే మురళి శర్మతో చెప్పించిన డైలాగ్ కూడా ఇంప్రెస్ చేసింది.

ఆంధ్రా కింగ్ గా కన్నడ స్టార్ ఉపేంద్ర..

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో హీరో రామ్ అయినా సినిమాలో ఆంధ్రా కింగ్ గా కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా ఇదే ఎనర్జిటిక్ గా ఉంటే ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ ఉంటుంది. నవంబర్ 29న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమాను భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. టీజర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ లో రామ్ లుక్స్ అయితే అదిరిపోతున్నాయి.

Full View
Tags:    

Similar News