థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో టాప్ ప్లేస్

ఇప్పుడు సినీ ప్రియులను ఓటీటీలో తెగ మెప్పిస్తోంది ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. నెట్ ఫ్లిక్స్ లో పెద్ద ఎత్తున వ్యూస్ ను అందుకుంటోంది.;

Update: 2025-12-31 10:04 GMT

థియేటర్స్ లో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు.. ఓటీటీలో రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే హిట్ అయిన సినిమాలకు మాగ్జిమమ్ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. కానీ థియేటర్స్ లో కొన్ని నిరాశపరిచిన చిత్రాలు మాత్రం అప్పుడప్పుడు ఓటీటీలో అదరగొడుతుంటాయి. భారీ రెస్పాన్స్ ను సంపాదించుకుని షాక్ ఇస్తాయి.

ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ విషయంలో సేమ్ అలాగే జరిగింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లీడ్ రోల్ లో ఫ్యాన్ బయోపిక్ గా రూపొందిన ఆ సినిమా.. నవంబర్ 27న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి రివ్యూలు, రేటింగ్ లను మూవీ అందుకుంది.

సినిమా బాగుందని అంతా చెబుతున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మొదట్లో కాస్త సాలిడ్ గానే వసూళ్లు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మెల్లగా తగ్గిపోయాయి. దీంతో రివ్యూస్, రేటింగ్స్ పాజిటివ్ గానే ఉన్నా.. కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఫ్లాప్ గా నిలిచిందని చెప్పాలి.

అయితే థియేటర్స్ రిలీజ్ అయిన నెల లోపే ఓటీటీలోకి వచ్చేసింది సినిమా. ఆంధ్ర కింగ్ తాలూకా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకోగా.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇప్పుడు సినీ ప్రియులను ఓటీటీలో తెగ మెప్పిస్తోంది ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ. నెట్ ఫ్లిక్స్ లో పెద్ద ఎత్తున వ్యూస్ ను అందుకుంటోంది. అంతే కాదు.. కొన్ని దేశాల్లో నెట్ ఫ్లిక్స్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం అటు సోషల్ మీడియాతోపాటు ఇటు టాలీవుడ్ సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

అయితే చాలా మంది ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చినప్పుడు.. కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ లో సినిమా మంచి వ్యూస్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అదే విషయాన్ని అప్పుడు కామెంట్స్ రూపంలో చెప్పారు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే జరిగింది. దీంతో అనుకున్నట్లు జరిగిందని ఇప్పుడు నెటిజన్లు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. కన్నడ నటుడు ఉపేంద్ర రియల్ లైఫ్ హీరో క్యారెక్టర్ పోషించగా.. ఆయన ఫ్యాన్ గా రామ్ కనిపించారు. ఆయన సరసన భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మహేష్ పి దర్శకత్వం వహించిన ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి గ్రాండ్ గా నిర్మించారు.

Tags:    

Similar News