సింపుల్‌గా క్లాస్ తీస్కున్న అన‌సూయ‌

ఇటీవ‌ల `పుష్ప 2: ది రూల్ ` చిత్రంలో అత్యంత ప్రభావం చూపే పాత్ర `దాక్షాయణి`గా న‌టించింది. దాక్షాయ‌ని మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌తో మెప్పించారు.;

Update: 2026-01-06 17:50 GMT

సీనియ‌ర్ యాంక‌ర్ గా, న‌టిగా అనసూయ భరద్వాజ్ త‌నకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెర వెండి తెర రెండు చోట్లా రాణిస్తున్న న‌టి. ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్ (లేడీ ఓరియెంటెడ్) సినిమాలతోను అన‌సూయ మెప్పించారు. ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లువురు అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్ట‌ర్ న‌టిగా క‌నిపిస్తూ, అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు

అనసూయ గతంలో `కథనం` అనే చిత్రంలో నాయిక‌గా నటించింది. త‌దుప‌రి మరికొన్ని పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫ్లాష్ బ్యాక్ అనే చిత్రంలో అనసూయ ఒక పవర్‌ఫుల్ అండ్ బోల్డ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రభుదేవా - రెజినా కసాండ్రాతో కలిసి ఆమె నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఓటీటీల కోసం రూపొందుతున్న ఓ రెండు వెబ్ సిరీస్ ల‌లోను అన‌సూయ న‌టిస్తోంది. ఇవి నాయికా ప్ర‌ధాన క్రైమ్ థ్రిల్ల‌ర్లు.

ఇటీవ‌ల `పుష్ప 2: ది రూల్ ` చిత్రంలో అత్యంత ప్రభావం చూపే పాత్ర `దాక్షాయణి`గా న‌టించింది. దాక్షాయ‌ని మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌తో మెప్పించారు. అన‌సూయ‌ సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను సైతం లెక్కచేయక తన దారిలో తాను దూసుకుపోతూ ముక్కుసూటి మనిషిగా గుర్తింపు పొందారు. ఇటీవ‌ల న‌టుడు శివాజీతో ఎపిసోడ్స్ లో అన‌సూయ తీవ్ర‌మైన ఉద్వేగంతో స్పందించారు. తాను కూడా హీరోయిన్ గా న‌టించాను! అని అన‌సూయ చేసిన వ్యాఖ్య‌ల‌కు సోష‌ల్ మీడియాల్లో కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. దీనికి అన‌సూయ క్లాస్ తీస్కుంటూ నిజ‌మైన హీరోయిన్ ఎలా ఉండాలో కూడా చెప్పారు. స‌త్యం మాట్లాడే ధైర్యం.. సొంత‌ దారిలో న‌డ‌వ‌డం.. న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉండ‌టం నిజ‌మైన హీరోయిన్ లక్ష‌ణాలు అని విశ్లేషించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

న‌టుడు శివాజీతో ఎపిసోడ్ లో అన‌సూయపై చాలా ట్రోలంగ్ జ‌రిగింది. కొన్నిసార్లు ఈ ట్రోలింగ్ ఏ రేంజుకు చేరిపోయింది! అంటే అన‌సూయ ఆల్మోస్ట్ ఎమోష‌నల్ అయిపోయి క‌న్నీటిని ఆపుకోవాల్సిన దుస్థితి కూడా వ‌చ్చింది. ఒక బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న మ‌హిళ‌గా అన‌సూయ ట్రోల‌ర్స్ ప‌నిని ఖండించారు.

Tags:    

Similar News