చీరకట్టులో అనసూయ.. అందమైన కౌంటరా?
సాధారణంగా అనసూయ మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత స్టైలిష్ గా కనిపిస్తుందో, సంప్రదాయ చీరకట్టులో అంతకు మించి అందంగా కనిపిస్తుంది.;
ఈమధ్య అనసూయ చేసిన కామెంట్స్ ఇంకాస్త హై రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆడవారి డ్రెస్సుల విషయంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కు ఆమె వరుస కౌంటర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె చీర కట్టులో కొన్ని గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా కౌంటర్ గా కొన్ని కొటేషన్స్ కూడా వదిలారు అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, నెటిజన్లతో టచ్ లో ఉండే సెలబ్రిటీల్లో అనసూయ భరద్వాజ్ ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, వెండితెరపై నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
సాధారణంగా అనసూయ మోడ్రన్ డ్రెస్సుల్లో ఎంత స్టైలిష్ గా కనిపిస్తుందో, సంప్రదాయ చీరకట్టులో అంతకు మించి అందంగా కనిపిస్తుంది. రీసెంట్ గా ఆమె లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ శారీలో దర్శనమిచ్చింది. దానికి జతగా నలుపు రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి, చాలా క్లాసీగా ముస్తాబైంది. సింపుల్ గా కనిపిస్తూనే తనదైన గ్రేస్ తో ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోల్లో అనసూయ ఇచ్చిన ఫోజులు, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి. మెడలో ఎలాంటి భారీ ఆభరణాలు లేకుండా, చెవులకు మాత్రం కాస్త పెద్దగా ఉండే హ్యాంగింగ్స్ పెట్టుకుని చాలా నేచురల్ లుక్ మెయింటైన్ చేసింది. ఆమె వదిలిన కురులు, లైట్ మేకప్ ఆ లుక్ ని మరింత ఎలివేట్ చేశాయి. అచ్చం బాపు బొమ్మలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం ఫోటోలు షేర్ చేయడమే కాకుండా, అనసూయ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. "దాని కోసం ఆశపడకు.. దాని కోసం కష్టపడు" అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అలాగే "నీకు ఏది సరైనదో అది చేయడానికి, నీ భయాలను అడ్డు రానివ్వద్దు" అనే కొటేషన్ ను కూడా షేర్ చేసి తన ఆటిట్యూడ్ చూపించింది.
వరుస వివాదాలు, ట్రోల్స్ వస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడమే అనసూయ స్టైల్. అప్పుడప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటోషూట్స్ తో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటుంది. మొత్తానికి ఈ లేటెస్ట్ శారీ లుక్ తో అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.