యాంక‌ర‌మ్మ ఇంటికి ఆంజ‌నేయుడు..

ఇప్పుడు తాజాగా అన‌సూయ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ మ‌రోసారి వైర‌ల్ అవుతుంది. అన‌సూయ రీసెంట్ గానే హైద‌రాబాద్ లో ఓ కొత్త ఇల్లు క‌ట్టుకుని ఆ ఇంటి గృహ‌ప్ర‌వేశం చేసింది.;

Update: 2025-05-19 09:52 GMT

బుల్లి తెర యాంక‌ర్ అన‌సూయ ఎన్నో టీవీ షోలు, ప‌లు సినిమాల‌తో బాగా పాపుల‌రైంద‌నే సంగ‌తి తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా అన‌సూయ త‌న క్రేజ్ ను ఏ ర‌కంగా పెంచుకుందో అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ షో కు యాంక‌రింగ్ చేయ‌డం మానేసిన అన‌సూయ ప‌లు టెలివిజ‌న్ షోలలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూనే కొన్ని సినిమాల్లో న‌టిస్తోంది.


ఓ వైపు టీవీ షో లు, మ‌రోవైపు సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదొక విష‌యం ద్వారా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అన‌సూయ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ మ‌రోసారి వైర‌ల్ అవుతుంది. అన‌సూయ రీసెంట్ గానే హైద‌రాబాద్ లో ఓ కొత్త ఇల్లు క‌ట్టుకుని ఆ ఇంటి గృహ‌ప్ర‌వేశం చేసింది.


భ‌ర్త‌తో క‌లిసి అన‌సూయ ఆ ఇంటి గృహ ప్ర‌వేశాన్ని ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేసింది. దానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తూ ఒకింత ఎమోష‌న‌ల్ అయింది. మా ఇంటికి ఆంజ‌నేయ స్వామి వ‌చ్చారు అంటూ అన‌సూయ చేసిన పోస్ట్, అందులోని ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అన‌సూయ త‌న కొత్త ఇంటికి శ్రీ రామ సంజీవని అనే పేరు పెట్టిన విష‌యం ఇప్ప‌టికే వెల్ల‌డించింది.


కొత్త ఇంటి గృహ ప్ర‌వేశం సంద‌ర్భంగా అన‌సూయ ఆ ఇంట్లో హోమాలు, పూజ‌లు, స‌త్య‌న్నారాయ‌ణ స్వామి వ్ర‌తం, మ‌ర‌క‌త లింగ రుద్రాభిషేకం లాంటివ‌న్నీ చేశామ‌ని అన‌సూయ త‌న పోస్ట్ లో రాసుకొచ్చింది. అందులో భాగంగా త‌మ గురువుగారు ఇంట్లో హోమం చేస్తున్న‌ప్పుడు త‌మ గురువు గారు ఫోన్ చూపిస్తూ ఆంజ‌నేయుడు వ‌చ్చాడ‌ని అన్నార‌ని అన‌సూయ త‌న పోస్ట్ లో తెలిపింది.


నాకు ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి ఏది మొద‌లుపెట్టాల‌న్నా ముందుగా జై హ‌నుమాన్ అని త‌ల‌చుకుంటూ ఉంటాన‌ని, అలా అనుకోకుండా ఏ ప‌నీ చేయ‌నని, నా తండ్రి త‌ర్వాత ఆ హ‌నుమంతుడిని నేను తండ్రిగా భావిస్తాన‌ని అలాంటి హ‌నుమంతుడు త‌న కొత్త ఇంటి గృహ ప్ర‌వేశం సంద‌ర్భంగా ఇంటికి వ‌చ్చి మా ఇంటి పేరుని, మా ఇంటిని, మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన‌సూయ ఎమోష‌న‌ల్ అయిన ఫోటోల‌ను షేర్ చేసింది.


Tags:    

Similar News