లోకేష్ క‌న‌గ‌రాజ్ బ‌ర్త్‌డే..స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ!

యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-02-24 00:30 GMT

యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ యాక్ష‌న్ డ్రామాని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే దీనికి ముందు లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కార్తితో రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ క్నైమ్ థ్రిల్ల‌ర్ `ఖైదీ`కి సీక్వెల్‌గా `ఖైదీ 2`, `విక్ర‌మ్‌`కు సీక్వెల్‌గా `విక్ర‌మ్ 2`ని రూపొందిస్తాన‌ని, అంతే కాకుండా `విక్ర‌మ్‌`లోని కీల‌క పాత్ర రోలెక్స్‌తో `రోలెక్స్‌`ని రూపొందిస్తాన‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌క‌టించారు.

అయితే ర‌జ‌నీకాంత్‌తో రూపొందించిన `కూలీ` మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ కావ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో క్రేజీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్ట‌డం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి ఆరేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్ర‌కారం ఇప్పుడు బ‌న్నీతో భారీ సినిమాని ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలోనే `ఖైదీ 2` ప్రాజెక్ట్ ని లోకేష్ క‌న‌గ‌రాజ్ ఆపేశారంటూ వార్త‌లు షికారు చేశాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ క్లారిటీ ఇచ్చారు.

ఐకాన్ మూవీ త‌రువాత `ఖైదీ 2`తెర‌కెక్కిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఓ ప‌క్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప‌నులు చూసుకుంటూనే మ‌రో ప‌క్క `ఖైదీ 2`కు సంబంధించిన ప‌నులు చేస్తున్నారు. కార్తి అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌డానికి రెడీ అవుతున్నారు. రీసెంట్‌గా `ఖైదీ 2`కు సంబంధించిన గ్లింప్స్‌ని పూర్తి చేశార‌ట‌. మార్చి 14న ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ పుట్టిన రోజు వేడుక‌ల సంద‌ర్భంగా ఈ గ్లింప్స్‌ని రిలీజ్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

30 సెక‌న్‌ల నిడివిగ‌ల ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయ‌ని, కార్తి అభిమానుల్ని ఇది విశేషంగా ఆక‌ట్టుకోనుంద‌ని కోలీవుడ్ టాక్‌. ఈ గ్లింప్స్ రిలీజ్‌తో `ఖైదీ2`పై అభిమానుల్లో నెల‌కొన్న అనుమానాల‌కు తెర‌దించబోతున్నాడ‌ట లోకేష్ క‌న‌గ‌రాజ్‌. 2019, అక్టోబ‌ర్ 25న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. కార్తి సినిమాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్లు రాబ‌ట్టిన తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం.

హీరోకు హీరోయిన్ లేకుండా రెగ్యుల‌ర్‌ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా రూపొందించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ డ్రామాల్లోనే స‌రికొత్త సంచ‌ల‌నంగా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పూర్తి కాగానే వ‌చ్చే ఏడాది చివ‌ర్లో సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ట‌. `జై భీమ్‌, అసుర‌న్‌, విడుద‌లై వంటి త‌దిత‌ర సినిమాల్లో న‌టించిన త‌మిళ్ అనే డైరెక్ట‌ర్ రూపొందిస్తున్న‌ `మార్ష‌ల్‌` చేస్తున్నాడు. దీనితో పాటు తెలుగు సినిమా కూడా ఉంది ఇవి రెండు పూర్తయ్యే లోపు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీని పూర్తి చేసి ఖైదీ 2`కు రెడీ కానున్నాడ‌ట‌.

Tags:    

Similar News