విరోష్ వెడ్డింగ్ లో జపనీస్ వంటకాలు..
'గీతా గోవిందం' సినిమాతో పరిచయమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటి సినిమాతోనే అద్భుతమైన ఆన్ స్క్రీన్ స కెమిస్ట్రీతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.;
'గీతా గోవిందం' సినిమాతో పరిచయమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటి సినిమాతోనే అద్భుతమైన ఆన్ స్క్రీన్ స కెమిస్ట్రీతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ వేసి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఒకవైపు రిలేషన్ లో కొనసాగుతూనే.. మరొకవైపు కెరియర్ పరంగా ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట..
పెళ్లిపై అధికారిక ప్రకటన..
ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిసినప్పటి నుంచి.. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లోని ప్యాలెస్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. మొన్నటి వరకు ఈ వార్తలన్నీ కూడా రూమర్స్ గానే వినిపించినా.. ఎట్టకేలకు ఫిబ్రవరి 22న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ తమ పెళ్ళి విషయాన్ని బహిర్గతం చేశారు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న.
విరోష్ వెడ్డింగ్ లో జపనీస్ వంటకాలు..
ఇకపోతే ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని ప్యాలెస్ లో వివాహం జరగబోతోంది. పైగా తమ వివాహ వేడుకకు సంబంధించిన పనులు కూడా రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే విరోష్ వెడ్డింగ్ లో ఎలాంటి వంటకాలు వడ్డించబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి రాగా.. ఈ మేరకు నటి రష్మిక మందన్న తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ విషయాలను అధికారికంగా ప్రకటించింది.
మెనూ కార్డుతో రష్మిక మందన్న క్లారిటీ..
ముఖ్యంగా ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే తమ పెళ్లిలో జపనీస్ వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.. రష్మిక షేర్ చేసిన ఫోటోలలో..గోల్డెన్ కలర్ క్లాత్ తో చాలా అందంగా అలంకరించబడిన టేబుల్ పై బ్లష్ పింక్ లిల్లీలు , గ్రీన్ కలర్ హైడ్రేంజాలను కలిగివున్న ఒక పూల కుండీతో పాటు గ్రీన్ కలర్ ఆపిల్స్, క్యాస్కేడింగ్ ద్రాక్ష పళ్ళ గుత్తిని ఆ టేబుల్ పై చాలా అందంగా అలంకరించారు.. దీనికి తోడు అతిథుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జపనీస్ భోజనం మెను కార్డును కూడా టేబుల్ పై చాలా ప్రత్యేకంగా అలంకరించడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అతిథుల కోసం విరోష్ జంట ప్రత్యేక శ్రద్ధ..
ఇక దీనిని బట్టి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కొన్ని ప్రత్యేకమైన జపనీస్ వంటకాలను ఈ వెడ్డింగ్ లో వడ్డించబోతున్నట్లు రష్మిక స్పష్టం చేసింది. మొత్తానికి అయితే తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి విషయంపై ఆచితూచి అడుగులు వేస్తున్న రష్మిక, విజయ్ దేవరకొండ ఇలా భోజనం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడంతో.. వారు తమ వివాహ వేడుకను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్ లు వ్యక్తమవుతున్నాయి .
మార్చి 4న రిసెప్షన్..
ఇకపోతే ఫిబ్రవరి 26న వివాహం జరిగితే.. మార్చి 4వ తేదీన హైదరాబాదులోని తాజ్ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ నాయకులు, బిజినెస్ మాగ్నెట్స్ ప్రత్యేక అతిధులుగా ఈ ఈవెంట్ కి హాజరుకానున్నారు.