నిజంగా హీరోయిన్ సాయి పల్లవి రేర్ పీస్!
`భానుమతి ఒక్కటే పీస్.. రెండు కులాలు..రెండు మతాలు హైబ్రీడ్ పిల్ల`. అని `ఫిదా` మూవీలో చెప్పినట్టు సాయి పల్లవి నిజంగానే రేర్ పీస్..ఐ మీన్ రేర్ యాక్టర్ అని.;
`భానుమతి ఒక్కటే పీస్.. రెండు కులాలు..రెండు మతాలు హైబ్రీడ్ పిల్ల`. అని `ఫిదా` మూవీలో చెప్పినట్టు సాయి పల్లవి నిజంగానే రేర్ పీస్..ఐ మీన్ రేర్ యాక్టర్ అని. ఆమె ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లు ఇందుకు అద్దంపడుతున్నాయి. మలయాళ మూవీ `ప్రేమమ్`లో మలర్‌గా కనిపించి తన మాయలో పడేసింది. తెలుగులో `ఫిదా`తో ఎంట్రీ ఇచ్చేసి టాలీవుడ్ ప్రేక్షకుల్ని తనకు ఫిదా అయ్యేలా చేయడమే కాకుండా ఇండస్ట్రీలోని క్రేజీ స్టార్స్, డైరెక్టర్స్ తన నటనకు, డ్యాన్స్‌కు ముగ్థులయ్యేలా చేసి వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ కెరీర్‌లో రాకెట్‌లా దూసుకుపోతోంది.
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అన్నట్టుగా ఎంత పెద్ద ఆఫర్ తనని వెతుక్కుంటూ వచ్చినా.. చిరంజీవి లాంటి స్టార్ ఆఫర్ ఇచ్చినా తనకు తగ్గ క్యారెక్టర్ కాకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ క్యారెక్టర్‌కు దూరంగా ఉంటూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లుకు మాత్రమే ప్రధాన్యత ఇస్తూ వస్తోంది. నటిగా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంటోంది. తమిళ సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్, కాలేజీ స్టూడెంట్ వంటి చిన్న చిన్న క్యారెక్టర్‌తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లివి ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
అలాంటి ఫేజ్ హీరోయిన్‌లకు చాలా రేర్‌గా వస్తుంటుంది. అలాంటి రేర్ అండ్ నెవర్ బిఫోర్ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తోంది. 2024, 2025 రెండేళ్లు రెండు బ్లాక్ బస్టర్లు తండేల్, అమరన్ మూవీస్‌ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో రెండు, తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ క్రేజీ లైనప్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `రామాయణ`లో సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. `దంగల్` ఫేమ్ నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రం మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది దీపావళికి భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రెండవ భాగాన్ని 2017 దీపావళి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. దీనితో పాటు థాయ్ రీమేక్ `వన్ డే` మూవీ ఆధారంగా ఆమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న `ఏక్ దిన్`లోనూ నటిస్తోంది. ఇక తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో ధనుష్ హీరోగా `అమరన్` ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో నటిస్తోంది.
ఇదీ కాకుండా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో విలక్షణ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందనున్న రొమాంటిక్ డ్రామాకు కూడా సాయి పల్లవి ఓకే చెప్పేసింది. దీన్ని లైకా ప్రొడక్షన్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించడానిక సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఒకేసారి `రామాయణ`తో పాటు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మూవీ వరకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా హీరోలు, డైరెక్టర్స్ కోరుకుంటున్న ఏకైక హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటూ రేర్ పీస్ అనిపించుకుంటోంది.