గ్యాంగ్ స్టర్ చెఫ్ గా నాని.. సుజీత్ ప్లాన్ రివీల్ ఎప్పుడంటే?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు, మరోవైపు స్టైలిష్ థ్రిల్లర్లతో కెరీర్ లో దూసుకుపోతున్నారు.;

Update: 2026-02-23 17:19 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు, మరోవైపు స్టైలిష్ థ్రిల్లర్లతో కెరీర్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. ఆ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన దసరా మూవీ బ్లాక్‌ బస్టర్‌ గా నిలవడంతో, ప్యారడైజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.



 


ది ప్యారడైజ్ లో నాని పూర్తిగా కొత్త గెటప్‌ లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. రగ్గ్డ్ లుక్, ఊర మాస్ క్యారెక్టర్, ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌ తో ఈసారి పవర్‌ ఫుల్ ప్రెజెన్స్ ఇవ్వనున్నారని సమాచారం. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, త్వరలోనే ఫస్ట్ సాంగ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ అప్డేట్‌ తో అభిమానులతోపాటు సినీ ప్రియుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

మరోవైపు, పవన్ కళ్యాణ్ ఓజీ ఫేమ్ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నాని మరో స్టైలిష్ యాక్షన్ డ్రామాకు సిద్ధమవుతున్నారు. సుజీత్ తెరకెక్కించిన ఓజీ అందరినీ ఆకట్టుకోవడంతో.. ఇప్పుడు నాని మూవీపై అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఓజీ ప్రమోషన్స్ లో సుజీత్ కూడా అదే విషయాన్ని చెప్పారు.

ఇప్పుడు నాని పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు. ఉదయం 11:11 గంటలకు టైటిల్‌ ను అనౌన్స్ చేయనున్నారు. దాంతోపాటు ఫస్ట్ లుక్‌ ను విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక కత్తి ఉండగా.. దానిపై మాస్టర్ చెఫ్ అని రాసి ఉంది.

అయితే పోస్టర్ పరంగా.. చిత్రం విభిన్నమైన కథతో ఉండబోతోందని తెలుస్తోంది. గ్యాంగ్‌ స్టర్ చెఫ్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, డార్క్ కామెడీ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో నాని కెరీర్‌ లో సుజీత్ మూవీ కొత్త జానర్‌ గా నిలిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇక క్యాస్టింగ్ విషయానికొస్తే.. బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ నటి మాధురి దీక్షిత్, విలన్ రోల్‌ కు పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ పూర్తి అయిన తర్వాత, 2026 సెకండాఫ్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి నాని- సుజీత్ మూవీకి మేకర్స్ ఏ టైటిల్ ఫిక్స్ చేశారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాలి.

Tags:    

Similar News