అల్లు శిరీష్ ఎంగేజ్‌మెంట్‌ ట్విస్ట్.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయంటూ..

ఈ ఈవెంట్ కోసం శిరీష్ చాలా స్పెషల్ ప్లాన్స్ చేసుకున్నాడు. కానీ, ఈ హ్యాపీ మూమెంట్‌కు 'మోంత' తుఫాన్ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది.;

Update: 2025-10-30 05:20 GMT

అల్లు ఫ్యామిలీలో చాలా కాలం తర్వాత పెళ్లి సందడి మొదలైంది. యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నైనిక అనే అమ్మాయితో ఆయన ఎంగేజ్‌మెంట్ ఈ నెల 31న జరగాల్సి ఉంది. ఈ ఈవెంట్ కోసం శిరీష్ చాలా స్పెషల్ ప్లాన్స్ చేసుకున్నాడు. కానీ, ఈ హ్యాపీ మూమెంట్‌కు 'మోంత' తుఫాన్ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది.

శిరీష్ ప్లాన్ చేసింది మామూలు ఎంగేజ్‌మెంట్ కాదు. తన ఇంట్లోనే, చల్లటి వాతావరణంలో, అందమైన గార్డెన్‌లో 'అవుట్‌డోర్ వింటర్ ఎంగేజ్‌మెంట్' చేసుకోవాలని కలలు కన్నాడు. దానికి తగ్గట్టే గ్రాండ్ డెకరేషన్స్ కూడా ప్లాన్ చేశారు. అంతా రెడీ అవుతున్న టైమ్‌లో 'మోంత' తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం శిరీష్ ప్లాన్స్ అన్నిటినీ పాడుచేసింది. అవుట్‌డోర్ కోసం వేసిన డెకరేషన్ మొత్తం వర్షానికి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకున్నాడు. "ఒక అవుట్‌డోర్ వింటర్ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ చేశాను.. కానీ వాతావరణ దేవుడి ప్లాన్స్ వేరేలా ఉన్నాయి" అంటూ కాస్త నిరాశగా పోస్ట్ పెట్టాడు.

తుఫాన్ దెబ్బకు, అనుకున్న ప్లాన్ మొత్తం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వేడుకను ఇంట్లోనే 'ఇండోర్‌'కు షిఫ్ట్ చేస్తున్నారు. అనుకున్న డేట్‌కే ఫంక్షన్ జరిగినా, శిరీష్ ఊహించుకున్న ఆ డ్రీమ్ అవుట్‌డోర్ సెటప్ మాత్రం వర్కవుట్ కానట్లే. ఇదిలా ఉంటే, శిరీష్ పెళ్లి చేసుకోబోయే నైనిక గురించి కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నిజానికి శిరీష్ తన కాబోయే భార్య ఫేస్‌ను ఇప్పటివరకు అఫీషియల్‌గా రివీల్ చేయలేదు. బహుశా ఈ ఎంగేజ్‌మెంట్‌తో గ్రాండ్‌గా పరిచయం చేద్దాం అనుకున్నాడేమో.

కానీ, ఆ ప్లాన్‌ను కూడా వదిన స్నేహా రెడ్డి (అల్లు అర్జున్ భార్య) దీపావళి టైమ్‌లోనే యాక్సిడెంటల్‌గా రివీల్ చేసేశారు. ఫ్యామిలీ ఫోటోలలో నయనిక ఫేస్ బయటకు వచ్చేసింది. మొత్తానికి, అల్లు శిరీష్ తన ఎంగేజ్‌మెంట్ విషయంలో ప్లాన్స్ డిఫరెంట్ గా ఉన్నా ఊహించని ట్విస్టులు ఎదురువుతున్నాయి. అయినప్పటికీ ఈ పాజిటివ్ హీరో మరింత హ్యాపీగా తన ప్లాన్స్ ను మార్చుకుంటున్నాడు. ఇక సినిమాల విషయంలో కొంత గ్యాప్ తీసుకున్న శిరీష్ రాబోయే రోజుల్లో ఓ డిఫరెంట్ మూవీ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News