మెగాస్టార్ ఇంటి దగ్గర్లో అల్లు అర్జున్ ఇంద్రభవనమా..
సక్సెస్ బాటలో ఉన్న స్టార్ హీరోలు తమ అభిరుచికి తగ్గట్టుగా విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకోవడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్.;
సక్సెస్ బాటలో ఉన్న స్టార్ హీరోలు తమ అభిరుచికి తగ్గట్టుగా విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకోవడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు నివాసం విషయంలోనూ తన రేంజ్ చూపిస్తున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆయన నిర్మిస్తున్న కొత్త ఇల్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఒక నివాసంలా కాకుండా, సకల సౌకర్యాలతో కూడిన ఒక అద్భుత కట్టడంలా దీనిని తీర్చిదిద్దుతున్నారట.
ముంబైలో ఒక పక్కా బేస్ మెంట్ వేసుకున్న బన్నీ, ఇటు హైదరాబాద్ లోనూ తన డ్రీమ్ హౌస్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. జుబిల్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అతి సమీపంలోనే ఈ భారీ మేన్షన్ రూపుదిద్దుకుంటోందని సమాచారం. దాదాపు 4,000 చదరపు గజాల భారీ విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఇంటి కోసం అల్లు అర్జున్ ఏకంగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.
ఇంటీరియర్ డిజైన్ నుండి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వరకు ప్రతిదీ చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ ఇంటి కోసం విదేశాల నుండి ప్రత్యేకమైన మార్బుల్స్ డెకరేటివ్ ఐటమ్స్ తెప్పించినట్లు తెలుస్తోంది. ఇల్లు మొత్తం అత్యాధునిక సాంకేతికతతో, స్మార్ట్ హోమ్ ఫీచర్లతో ఉండబోతోంది. ఒక మినీ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్ తో పాటు విశాలమైన గార్డెన్ ఏరియా ఈ ఇంటికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.
కేవలం లగ్జరీ మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ తన అభిరుచులకు తగ్గట్టుగా పర్సనల్ లైబ్రరీ ఆఫీస్ స్పేస్ కూడా ఇందులోనే సెట్ చేసుకున్నారట. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివర్లోనే గృహప్రవేశం చేసేందుకు అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల తర్వాత లేదా ఆ సమయానికే ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇప్పటికే అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి పలుమార్లు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. జుబిల్లీహిల్స్ లోని బడా పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల నివాసాల మధ్య ఈ కొత్త భవనం ఒక హైలెట్ గా నిలిచిపోతుందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ తన ఎదుగుదలకు తగ్గట్టుగా నివాసాన్ని కూడా అంతే గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా తన లైఫ్ స్టైల్ విషయంలో కూడా ఆయన ఒక ఐకాన్ అని అర్ధమవుతుంది. త్వరలోనే ఈ ఇంద్రభవనానికి సంబంధించిన మరిన్ని విజువల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది.