అల్లు బాస్ లైనప్ చూస్తే షాకే.. అరవింద్ గారు ఫుల్ బిజీ!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఆయన కూడా ఒకరు.;
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఆయన కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో హిట్స్ అందుకున్నారు. మూవీ లవర్స్ కు సూపర్ హిట్ సినిమాలు అందించారు. కొన్నేళ్ల క్రితం గీతా ఆర్ట్స్ ను స్టార్ట్ చేసి ఇప్పటికే అనేక చిత్రాలు నిర్మించారు. తన మార్క్ టాలెంట్ తో విజయాలు సొంతం చేసుకున్నారు.
ఆ తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను అల్లు అరవింద్ స్టార్ట్ చేయగా.. ఆ సంస్ధ బాధ్యతలను నిర్మాత బన్నీ వాస్ చూసుకుంటున్నారు. మీడియం అండ్ చిన్న రేంజ్ సినిమాలను GA2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఆ సంస్థ నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మెప్పించాయి. మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచాయి.
అయితే అల్లు అరవింద్.. ఇప్పటికే అనేక మందికి మెలకువలు నేర్పించిన విషయం తెలిసిందే. బన్నీ వాస్ కూడా ఆ కోవకు చెందినవారే. ఆయనతోపాటు పలువురిని GA 2 పిక్చర్స్ లో భాగస్వాములను చేశారు అల్లు అరవింద్. అలా అనేక మంది స్కిప్ట్ లను ఫిక్స్ చేయడంలో, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేయడంలో, సినిమాలు నిర్మించడంలో చురుకుగా పాల్గొంటున్నారు.
అదే సమయంలో ఇప్పుడు అల్లు అరవింద్.. 2026, 2027లో అనేక సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ బ్యానర్ పై అల్లు అర్జున్ హీరోగా సినిమాను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. 2027లో ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దాంతోపాటు అల్లు అరవింద్ ఇప్పటికే పలు హీరోలకు, డైరెక్టర్లకు అడ్వాన్సులు చెల్లించారని సమాచారం. త్వరలోనే ఆయా సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు రానున్నాయని తెలుస్తోంది. రీసెంట్ గా నిర్మించిన సింగిల్ సూపర్ హిట్ అయ్యాక అల్లు అరవింద్.. శ్రీవిష్ణుతో మరో రెండు సినిమాలు చేస్తారని ప్రకటించారు. అవి త్వరలోనే రానున్నాయి.
శ్రీవిష్ణుతోపాటు విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, కిరణ్ అబ్బవరం వంటి పలువురు హీరోలు.. GA2 పిక్చర్స్ తో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అరవింద్ ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అల్లు అరవింద్ ఫుల్ బిజీగా ఉండనున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.